Breaking News

అందుకే సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది: కత్రినా కైఫ్‌

Published on Thu, 09/01/2022 - 17:58

బాలీవుడ్‌ బ్యూటీ కత్రినా కైఫ్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్‌ హీరోయిన్‌ రాణిస్తున్న ఆమె ఇటీవల హీరో విక్కీ కౌశల్‌ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లికి ముందు కొంతకాలం సీక్రెట్‌ డేటింగ్‌లో ఉన్న వీరిద్దరూ గతేడాది ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. ప్రేమ, పెళ్లి విషయంలో కత్రినా-విక్కీలు చాలా గొప్యత పాటించారు. తాజాగా దానికి గల కారణమేంటో వివరించింది కత్రినా. ఇటీవల జరిగిన వోల్ఫ్‌777 ఫిలింఫేర్‌ ఆవార్డు ఫంక్షన్‌లో విక్ట్రీనా దంపతులు మెరిసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం అనంతరం కత్రినా జూమ్‌ టీవీతో మాట్లాడుతూ.. పెళ్లి విషయంలో గొప్యత పాటించడం వెనుక అసలు కారణం చెప్పింది. ‘కరోనా సమయంలో నా ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడింది. అందరు కరోనా బారిన పడ్డారు.

చదవండి: విషాదం.. యువ నటి ఆత్మహత్య, వైరల్‌గా మారిన సూసైడ్‌ నోట్‌

వారి విషయంలో మరో చాన్స్‌ తీసుకోవాలని అనుకొలేదు. మళ్లీ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా మా వివాహ వేడుకకు సంబంధించిన విషయాలను రహస్యంగా ఉంచాల్సి వచ్చింది. అందుకే కేవలం కుటుంబ సభ్యులు, బంధువులకు మాత్రమే ఆహ్వానం ఇచ్చాం. మా పెళ్లి సీక్రెట్‌గా జరగడానికి అదే కారణం. అలాంటి పాండమిక్‌లో కూడా మా వివాహం చాలా అద్భుతంగా జరిగింది. ఇద్దరం(నేను, విక్కి) చాలా సంతోషంగా ఉన్నాం’ అని చెప్పుకొచ్చింది. కాగా గతేడాది డిసెంబర్‌ 9న రాజస్థాన్‌లోని సిక్స్‌ సెన్సెస్‌ ఫోర్ట్‌ బర్వారాలో విక్ట్రీనా (విక్కీ కౌశల్, కత్రినా కైఫ్‌) పెళ్లి ఘనంగా జరిగింది. అప్పటి వరకు పెళ్లిపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వని కత్రినా-విక్కీలు.. మరుసటి రోజే పెళ్లి ఫొటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేశారు. 

చదవండి: హే సీతా-హే రామ.. ఫుల్‌ వీడియో సాంగ్‌ వచ్చేసింది.. చూశారా?

Videos

చంద్రబాబు అప్పుల చిట్టా.. ఆధారాలతో బయటపెట్టిన వైఎస్ జగన్

మన యుద్ధం చంద్రబాబు ఒక్కడితో కాదు..!

అండర్ గ్రౌండ్ లో అవినీతి తీగ

హైదరాబాద్ శిల్పకళావేదికలో మిస్ వరల్డ్ టాలెంట్ ఫైనల్

Watch Live: వైఎస్ జగన్ కీలక ప్రెస్ మీట్

వాషింగ్టన్ డీసీలో కాల్పుల కలకలం

దీన్నే నమ్ముకొని ఉన్నాం.. మా పొట్టలు కొట్టొద్దు.. ఎండీయూ ఆపరేటర్ల ధర్నా

నా పర్మీషన్ తీసుకోవాల్సిందే!

ఢిల్లీ-శ్రీనగర్ విమానానికి తప్పిన ప్రమాదం

ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు బండారం బయటపడుతుందనే ఉరవకొండకి రాలేదు

Photos

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కాన్స్‌లో అదితి : ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)