Breaking News

కత్రినా కైఫ్‌కు క్రేజీ ఛాన్స్.. ఆ దేశానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా!

Published on Tue, 06/10/2025 - 15:30

బాలీవుడ్ భామ కత్రినా కైఫ్‌కు అరుదైన ఛాన్స్ దక్కింది. ఆమె పర్యాటక అభివృద్ధికి అంబాసిడర్‌గా ఎంపికైంది. అయితే కత్రినాను ఎంపిక చేసింది మాత్రం మన దేశానికి కాదు. గతేడాది మనదేశంతో దౌత్యపరమైన వివాదానికి తెరలేపిన దేశానికి ఆమె గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. ఆ దేశం మరెదో కాదు.. మన దగ్గర్లోనే ఉన్న మాల్దీవుస్‌. 

కత్రినా కైఫ్‌ను మాల్దీవులకు ప్రపంచ పర్యాటక రాయబారిగా నియమించినట్లు మాల్దీవుల మార్కెటింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కార్పొరేషన్  వెల్లడించింది.  భారత చిత్ర పరిశ్రమలో ప్రముఖ వ్యక్తి అయిన కత్రినా కైఫ్‌ను మాల్దీవులకు గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం పట్ల తాము సంతోషంగా ఉన్నామని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించేందుకు బాలీవుడ్‌ హీరోయిన్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ అవకాశం రావడంపై బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ స్పందించింది. గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడంపై సంతోషం వ్యక్తం చేసింది. మాల్దీవులు అందించే లగ్జరీ, అందాలను సూచించడానికి ఉత్సాహంగా ఉన్నట్లు పేర్కొంది.

గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా తన కొత్త రోల్‌ గురించి కత్రినా మాట్లాడుతూ.. 'మాల్దీవులు లగ్జరీ, సహజ సౌందర్యానికి కేరాఫ్ అడ్రస్. చక్కని ప్రశాంతంగా ఉండే ప్రదేశం. సన్నీ సైడ్ ఆఫ్ లైఫ్‌గా ఎంపికైనందుకు నేను గౌరవంగా భావిస్తున్నా. ఈ సహకారం ప్రపంచ పర్యాటక ప్రేక్షకులకు అత్యుత్తమ ప్రయాణ అనుభవాలను తీసుకురావడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ అద్భుతమైన గమ్యస్థానం, ప్రత్యేకమైన ఆకర్షణ, ప్రపంచ స్థాయిలో పేరు పొందేలా సహాయపడటానికి  ఉత్సాహంగా ఉన్నానని" తెలిపింది. అయితే ప్రధాని మోదీ పర్యటనకు ముందు ఈ ప్రకటన రావడం విశేషం. వచ్చే నెలలో మాల్దీవుస్‌లో ప్రధాని పర్యటించనున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)