Breaking News

రవితేజకు సారీ చెప్పిన అనుపమ్ ఖేర్.. ఎందుకంటే?

Published on Thu, 10/05/2023 - 20:36

బాలీవుడ్‌ సీనియర్ నటుడు అనుపమ్‌ ఖేర్ తెలుగువారికి కూడా సుపరిచితమే. ది కశ్మీర్ ‍ఫైల్స్‌ చిత్రంలో ప్రేక్షకులను మెప్పించిన ఆయన.. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్‌ నాగేశ్వరరావులో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్‌ రిలీజ్‌ కాగా.. అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని వంశీకృష్ణనాయుడు దర్శకత్వంలో అభిషేక్‌ అగర్వాల్‌  నిర్మిస్తున్నారు. 

రవితేజ ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించారు. ఇటీవలే ముంబయిలో ఈవెంట్‌కు రవితేజ హాజరయ్యారు. అయితే ఈవెంట్‌లో అనుపమ్‌ ఖేర్ సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అదేంటో తెలుసుకుందాం. 

(ఇది చదవండి: బిగ్‌బాస్‌ 7: మళ్లీ గ్రాండ్‌ లాంచ్‌.. హౌస్‌లోకి కొత్త కంటెస్టెంట్లు.. కానీ..)

ఈవెంట్‌కు హాజరైన అనుపమ్.. గతంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఒకసారి చిన్న వయసులో రవితేజ తన స్టూడియోకి వచ్చి నాతో ఫోటో దిగాలని అడిగాడు. కానీ నేను కుదరదని చెప్పా.. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆయన సినిమాలోనే నటిస్తున్నా.. ఆ రోజు అలా అన్నందుకు రవితేజకు నవ్వుతూ సారీ అన్నారు. దీంతో వెంటనే రవితేజ.. సార్ అంటూ దండం పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. 

ఈ చిత్రంలో నుపుర్ సనన్, గా యత్రి భరద్వాజ్‌ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. 1970లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గుంటూరు జిల్లాలోని స్టువర్టుపురానికి చెందిన ఒకనాటి గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు జీవితాన్నే ఈ చిత్రంలో చూపించనున్నారు.  ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 20న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

(ఇది చదవండి: 'సీరియల్ కిల్లర్‌ నడిరోడ్డుపై గుడ్డిగా షూట్‌ చేస్తున్నాడు'.. ఆసక్తిగా లియో ట్రైలర్!)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)