Breaking News

స్టార్‌ హీరో ఇంట్లో అద్దెకు దిగిన యంగ్‌ హీరో, రెంట్‌ ఎంతో తెలుసా?

Published on Thu, 01/19/2023 - 16:19

బాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తీక్‌ ఆర్యన్‌ ప్రస్తుతం 'షెహజాదా' సినిమాలో నటిస్తున్నాడు. టాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌గా నిలిచిన అల వైకుంఠపురములో సినిమాకు ఇది రీమేక్‌ అన్న విషయం తెలిసిందే! షెహజాదా ఫిబ్రవరి 10న థియేటర్లలో విడుదల కానుంది. ఇదిలా ఉంటే కార్తీక్‌.. బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ ఇంట్లో అద్దెకు దిగుతున్నాడట! ముంబైలోని జుహులో షాహిద్‌ కపూర్‌కు లగ్జరీ అపార్ట్‌మెంట్‌ ఉంది. గతేడాది వరకు షాహిద్‌ తన భార్య మీరా రాజ్‌పుత్‌.. పిల్లలు జైన్‌, మిషాతో కలిసి అక్కడే ఉండేవాడు. ఇటీవలే వీరు వర్లిలోని డూప్లెక్స్‌ ఇంటికి షిఫ్ట్‌ అయ్యారు. దీంతో ప్రానెటా బిల్డింగ్‌లోని తన అపార్ట్‌మెంట్‌ ఖాళీ అయింది.

తాజాగా ఈ అపార్ట్‌మెంట్‌లోకి కార్తీక్‌ ఆర్యన్‌ అద్దెకు దిగినట్లు తెలుస్తోంది. ఈ లగ్జరీ ఇంటి అద్దె రూ.7.5 లక్షలు కాగా ఏడాది తర్వాత రెంట్‌ పెరుగుతుందట. రెండో ఏడాది నెలనెలా రూ.8.02 లక్షలు కట్టాల్సి ఉంటుందట. ఇక మూడో సంవత్సరంలో ఏకంగా రూ.8.58 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. సెక్యూరిటీ డిపాజిట్‌ కింద రూ.45 లక్షలు ముందుగానే అప్పజెప్పాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కూడా సంక్రాంతికి ముందే పూర్తైనట్లు బీటౌన్‌లో ఓ వార్త వైరల్‌గా మారింది. కాగా కార్తీక్‌ ఆర్యన్‌ గతంలో వెర్సోవాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసించేవాడు. దీన్ని 2019లో రూ.1.60 కోట్లకు కొనుగోలు చేశాడు.

చదవండి: రోజూ రాత్రి ఒంటరిగా వెక్కి వెక్కి ఏడ్చేదాన్ని: రష్మిక
డైరెక్టర్‌కు మెగాస్టార్‌ ఖరీదైన బహుమతి

Videos

కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్

హైదరాబాద్ లో కరోనా కేసు నమోదు

జహీరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్

ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం

YSRCP హరికృష్ణను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి.. దారుణం! : Ambati Rambabu

Sake Sailajanath: ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు

First case: కడప కరోనా కేసును దాచిపెట్టేందుకు అధికారుల యత్నం

హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ 6 షరతులు

Chittoor: మామిడి రైతుల ఆవేదన..చేతులెత్తేసిన కూటమి

West Godavari: పేదల కల కలగానే మిగిలింది పడకేసిన ఇళ్ల నిర్మాణ పనులు

Photos

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)