Breaking News

వాళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్‌.. డేటింగ్‌ చేసి తప్పు చేశా: హీరో

Published on Thu, 04/11/2024 - 15:56

ప్రేమ ఎప్పుడు, ఎలా పుడుతుందో చెప్పలేం. తెలియకుండానే కొందరు ప్రేమలో పడిపోతారు. కానీ కొందరే చివరివరకు ఆ ప్రేమను నిలుపుకుంటారు. చాలామటుకు ప్రేమలు మధ్యలోనే పుటుక్కుమంటాయి. ఇది సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తీక్‌ ఆర్యన్‌ కూడా గతంలో ఇద్దరు హీరోయిన్లతో ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వచ్చాయి. కానీ దేనికీ శుభం కార్డు పడలేదు. లవ్‌ ఆజ్‌ కల్‌ 2 సినిమా షూటింగ్‌ సమయంలో సారా అలీ ఖాన్‌తో, దోస్తానా 2 మూవీ చిత్రీకరణ టైంలో జాన్వీ కపూర్‌తో ప్రేమలో ఉన్నట్లు టాక్‌ నడిచింది.

ఇద్దరమ్మాయిలతో డేటింగ్‌
దోస్తానా 2 షూటింగ్‌ మొదలుపెట్టిన కొంతకాలానికే ఆ మూవీ అటకెక్కింది. అప్పుడే వీరి ప్రేమ కూడా ముగిసిపోయింది. తాజాగా నేహా ధూపియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్‌.. తన పాత లవ్‌ కహానీల గురించి ప్రస్తావించాడు. ఇద్దరు క్లోజ్‌ ఫ్రెండ్స్‌తో డేటింగ్‌ చేసినందుకు ఏమైనా గిల్టీగా ఫీలవుతున్నారా? అన్న ప్రశ్నకు అవునని బదులిస్తూనే.. ఒకవేళ నాతో బ్రేకప్‌ అయిన తర్వాత వాళ్లు క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అయ్యుంటే..? ఏదేమైనా అందుకు గిల్టీగానే ఫీలవుతున్నాను అన్నాడు.

కనిపిస్తే అదే అడుగుతా
మాజీ ప్రేయసి కనిపిస్తే ఫస్ట్‌ ఏం మాట్లాడతావు? అని హోస్ట్‌ ప్రశ్నించగా.. ప్రస్తుతం నీ లైఫ్‌ ఎలా ఉంది? అని ఆరా తీస్తాను అని చెప్పుకొచ్చాడు. కాగా సారా అలీఖాన్‌, జాన్వీ కపూర్‌.. ఇద్దరూ క్లోజ్‌ఫ్రెండ్స్‌ అన్న సంగతి తెలిసిందే! కార్తీక్‌ విషయానికి వస్తే.. ప్రస్తుతం చాందు చాంపియన్‌ సినిమా చేస్తున్నాడు. అలాగే భూల్‌ భులయ్యా 3, ఆషిఖి 3 చిత్రాలు అతడి చేతిలో ఉన్నాయి.

చదవండి: నటి భర్తకు గుండెపోటు.. క్షమాపణలు చెప్తూ పోస్ట్‌!

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)