Breaking News

ప్రేమకథ ఆలస్యం

Published on Thu, 07/31/2025 - 01:38

హీరోయిన్  శ్రీలీల బాలీవుడ్‌లో నటిస్తున్న తొలి హిందీ చిత్రం రిలీజ్‌ వాయిదా పడింది. కార్తీక్‌ ఆర్యన్ , శ్రీలీల హీరో హీరోయిన్లుగా అనురాగ్‌ బసు దర్శకత్వంలో ఓ ప్రేమకథ రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి రిలీజ్‌ చేయనున్నట్లు గతంలో మేకర్స్‌ ప్రకటించారు. అయితే ఈ సినిమా ఈ దీపావళికి విడుదల కావడం లేదని, వచ్చే ఏడాది రిలీజ్‌ చేస్తామని దర్శకుడు అనురాగ్‌ బసు వెల్లడించారు.

‘‘ఇప్పటి వరకు మా సినిమా చిత్రీకరణ 40 శాతం పూర్తయింది. కార్తీక్‌ ఆర్యన్  మా సినిమాతోపాటుగా మరో సినిమా కూడా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో కార్తీక్‌ డిఫరెంట్‌ లుక్స్‌తో కనిపిస్తాడు. ఈ లుక్స్‌ పరంగా ఇబ్బందులున్నాయి. ఆగస్టు లేదా సెప్టెంబరులో మా సినిమా కొత్త షెడ్యూల్‌ చిత్రీకరణను ప్రారంభిస్తాం.

అయితే ‘సయారా’ సినిమా స్టోరీకి మా కథ దగ్గరగా ఉందని, దీంతో స్క్రిప్ట్‌లో మార్పులు చేయాల్సి రావడం వల్లే ఈ ఏడాది మా చిత్రం రిలీజ్‌ కావడం లేదన్న వార్తల్లో నిజం లేదు. ‘సయారా’ కథకు, మా సిని మాకు సంబంధం లేదు’’ అన్నారు అనురాగ్‌ బసు. ఇలా శ్రీలీల తొలి హిందీ సినిమా రిలీజ్‌ అనుకున్న సమయానికన్నా కాస్త ఆలస్యంగా కానుంది. ఇక ప్రస్తుతం తెలుగులో ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’, తమిళంలో ‘పరాశక్తి’ వంటి చిత్రాలతో శ్రీలీల బిజీగా ఉన్నారు.

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)