Breaking News

విడాకులవుతాయని కలలో కూడా ఊహించలేదు.. కానీ రెండో పెళ్లి

Published on Sat, 05/02/2026 - 20:28

కార్తీకదీపం సీరియల్ పేరు చెప్పగానే అందరికీ దీపనే గుర్తొస్తుంది. వంటలక్కగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతలా ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులోనే ఈమె తల్లి సుమిత్రగా చేస్తున్న నటి సీత గురించి చాలామందికి తెలుసు. బాలనటిగా కెరీర్ ప్రారంభించి పలు సినిమాలు, సీరియల్స్ చేస్తూ బాగానే పేరు తెచ్చుకుంది. అయితే ఈమె అప్పుడప్పుడు బుర్కా ధరించడం, నమాజ్ చేస్తుండటంపై వస్తున్న ప్రశ్నలకు రీసెంట్‌గా క్లారిటీ ఇచ్చింది. తను రెండో పెళ్లి చేసుకోవడం గురించి కూడా వివరణ ఇచ్చింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ సినిమా.. 44 ఏళ్ల తర్వాత తొలిసారి స్ట్రీమింగ్)

'చాలారోజులుగా నేను దీని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నా ఫాలోవర్స్‌కి నాపై చాలా డౌట్స్ ఉన్నాయి. ఎప్పుడు చూసినా కామెంట్స్‌లో అడుగుతూనే ఉంటారు. సీతాలక్ష్మీ అనే పేరు ఉంది కదా, బొట్టు పెట్టుకోవచ్చు కదా? ఎందుకు పెట్టుకోవడం లేదని అడుగుతుంటారు. మీరు బుర్కా ఎందుకు ధరిస్తున్నారని కూడా అడుగుతున్నారు. కావాలనే వేసుకుంది, నటిస్తుందని అంటుంటారు. ఇలా చాలామందికి అర్థం కావట్లేదు. వాటిపై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నా పేరు సీతాలక్ష్మీ. అది అమ్మనాన్న పెట్టిన పేరు. నా ఆధార్ కార్డ్, బ్యాంక్ డీటైల్స్ అన్నింటిలో అలానే ఉంది. అయితే నా జీవితంలో ఓ చేదు జ్ఞాపకముంది. ఆ టైంలో చాలా ఇబ్బంది పడ్డాను. దాన్నుంచి బయటకు రావడానికి నాలుగేళ్ల పట్టింది. 2013 తర్వాత నాలుగేళ్లు యాక్టింగే చేయలేదు. ఎందుకంటే అప్పుడు నాకు విడాకులయ్యాయి. ఇది ఎందరికీ తెలుసో తెలీదు. కానీ నిజం చెప్పడానికి బాధపడను. అనుభవిస్తే కానీ ఆ బాధ అర్థం కాదు'

'నాకు విడాకులు అయిన తర్వాత మా స్కూల్ ఫ్రెండ్ కలిశాడు. నా బాధలు అతడితో చెప్పుకొన్న తర్వాత మనం పెళ్లి చేసుకుందామని అన్నాడు. తోడు కావాలని ఓకే చెప్పేశాను. అలా అతడిని పెళ్లి చేసుకున్నాను. మా ఇంట్లో ఒప్పుకోలేదు. కానీ ఆయన వైపు వాళ్లు నన్ను అంగీకరించారు. నా భర్త పేరు అబ్దుల్ ఖాదర్. ఆయాస్ అని పిలుస్తారు. నా గురించి అంతా తెలిసిన వ్యక్తి. నన్ను అర్థం చేసుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అలా మేం ఒక్కటయ్యాం. కొన్ని పరిస్థితుల్లో నేను వాళ్ల మతంలోకి మారాల్సి వచ్చింది. మా ఇంట్లో ఎలాంటి సపోర్ట్ లేదు. అత్తగారింట్లో సపోర్ట్ కావాలంటే కొన్ని చేయకతప్పదు. అందుకే వాళ్ల వైపు వెళ్లిపోయా. అలా మా అత్తగారు నాకు యాస్మిన్ అని పేరు పెట్టారు. అలా సీతాలక్ష్మి కాస్త యాస్మిన్ అయింది. వాళ్లు నన్ను యాస్మిన్ అనే పిలుస్తారు. సీత అని పిలవరు'

'పేరు మార్చుకుంటే ఇండస్ట్రీలో కుదరదు కాబట్టి సీత అని అలానే ఉంచేసుకున్నా. నా భర్త వైపు వాళ్లు మాత్రం యాస్మిన్ అనే పిలుస్తారు. వాళ్ల ఇష్టానికి వ్యతిరేకంగా నేనేం చేయను. అందుకే బుర్కా ధరిస్తాను. అయితే వాళ్లు ఇలానే ఉండాలి, అలాగే ఉండాలి అని నన్ను బలవంతం చేయరు. షూటింగ్‌కి వచ్చినప్పుడు మాత్రం నచ్చినట్టు ఉంటాను. అందుకే ఒకసారి బొట్టు పెట్టుకుంటాను. ఇంకోసారి పెట్టుకోను. అంతే తప్ప హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ ఇవేం ఉండవు. నాకు మతపరమైన ఫీలింగే లేదు. నా జీవితంలో చాలా ఆశపడ్డాను. కానీ ఒక్కటీ జరగలేదు. విడాకులు అవుతాయని కలలో కూడా ఊహించలేదు. రెండో పెళ్లి కూడా ఊహించలేదు' 

'దేవుడు ముందే అంతా నిర్ణయించి ఉంటాడు. రాసినదాన్ని తప్పించుకోలేం. వద్దంటే ఆగిపోదు.. కావాలంటే రాదు. మా అత్తగారి ఇంటి వాళ్ల కోసం అలా మారాను. నేనే తప్పు చేయడం లేదు. నేను అల్లాని మొక్కుతా. నమాజ్ చేస్తా. నిజాయితీగా ఉంటా. నేను ఎవరికీ చెడు చేయలేదు. నేను కష్టపడుతున్నా. నేను తింటున్నా. నా బాధలైనా ఆనందం అయినా దేవుడితోనే, అది ఏ దేవుడైనా అయ్యి ఉండొచ్చు' అని సీత వివరణ ఇచ్చింది.

(ఇదీ చదవండి: ఓటీటీలో క్రేజీ యానిమేషన్ మూవీ.. తెలుగు రివ్యూ)

Videos

సీరియల్ ఇండస్ట్రీలో నెపోటిజం చాలా అవమానాలు పడ్డా.. ఒకరోజు నాగార్జున కాల్ చేసి..!

ఒకే కుటుంబం ఆఖరి ప్రయాణం. AI వీడియో..

ప్రాణం తీసిన పాపులారిటీ భార్యపై ఈగోతో కొడవలితో హత్య

మార్కెట్లు కుప్పకూలిన జెట్ స్పీడ్ లో దూసుకెళ్లిన స్టాక్

నమ్మించి మోసం చేయడం కాంగ్రెస్ నైజం

ట్యూషన్ వెళ్తున్న బాలుడి కిడ్నాప్ తెలివిగా తప్పించుకుని పేరెంట్స్ కి ఫోన్..

దళితులపై రఘురామ వ్యాఖ్యలు ఇచ్చిపడేసిన మందకృష్ణ మాదిగ

ఆందోళన చేస్తున్న మహిళలను ఈడ్చిపడేసిన పోలీసులు

విజయ్ అనే నేను.! ప్రమాణ స్వీకారానికి ప్రాక్టీస్ చేస్తున్న దళపతి

నీకు వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య నువ్వా మా పార్టీ కోసం మాట్లాడేది

Photos

+5

యాంకర్ రష్మి ప్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

చరణ్ అతిథిగా మెగా కోడలి సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ సావిత్రి కుమార్తె 21 రోజుల వేడుక (ఫొటోలు)

+5

మిస్ యూనివర్స్ ఇండియా టు హీరోయిన్‌.. ఎవరీ రియా సింఘా? (ఫొటోలు)

+5

తెలంగాణలో గుహ మధ్య అద్భుతమైన ఆలయం (ఫొటోలు)

+5

హైదరాబాద్ : వైద్య విద్యార్థుల ఆనందం చెట్ట‘పట్టా’ల్‌ (ఫొటోలు)

+5

ఏపీ : పలు జిల్లాలో ఈదురుగాలులతో భారీ వర్షం (ఫొటోలు)

+5

బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య రిసెప్షన్‌: ప్రముఖుల సందడి (ఫోటోలు)

+5

ప్రెగ్నెన్సీతో మ్యాడ్ స్క్వేర్‌ బ్యూటీ రెబా మోనికా జాన్ (ఫోటోలు)

+5

టాలీవుడ్ నటి మీనా వాసు మ్యారేజ్ డే.. భర్తకు స్పెషల్ విషెస్ (ఫోటోలు)