Breaking News

అప్పుడు నేను కోమాలో ఉన్నాను: విరూపాక్ష డైరెక్టర్‌

Published on Wed, 04/26/2023 - 08:05

ఇటీవలి కాలంలో హారర్‌ కామెడీ సినిమాలు వచ్చాయి. కానీ ఓ స్ట్రిక్ట్‌ అండ్‌ హానెస్ట్‌ హారర్‌ ఫిలిం రాలేదు. అందుకే హారర్‌ జానర్‌కు అభిమానిని అయిన నేను విరూపాక్ష తీశాను. ప్రేక్షకులను థ్రిల్‌ చేయాలని సినిమాలోని మర్డర్‌ సీక్వెన్స్‌లను కొత్తగా డిజైన్‌ చేశాం అన్నారు దర్శకుడు కార్తీక్‌ దండు. సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా కార్తీక్‌ దండు దర్శకత్వంలో రూపొందిన చిత్రం విరూపాక్ష. సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకంపై బి.బాపినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న రిలీజైంది.

ఈ సందర్భంగా మంగళవారం విలేకర్ల సమావేశంలో కార్తీక్‌ మాట్లాడుతూ.. 2016-17 సమయంలో ఓ పేపర్‌లో ఒక ఆర్టికల్‌ చదివాను. చేతబడి చేస్తున్నారనే ఆరోపణతో ఓ మహిళను గ్రామస్తులు కొట్టి చంపేస్తారు. ఆమెకు నిజంగా చేతబడి చేసే శక్తులు ఉంటే ఏం జరుగుతుందని ఊహించి విరూపాక్ష కథ రాశాను. నా కథను నమ్మిన సుకుమార్‌ గారు స్క్రీన్‌ప్లే అందించి, తాను ఓ నిర్మాతగా ఉంటానన్నారు. అలాగే సాయితేజ్‌గారిని హీరోగా నిర్ణయించి, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ గారిని నిర్మాతగా నిర్ణయించారు.

అయితే విరూపాక్ష షూటింగ్‌ను మరో రెండు మూడు రోజుల్లో మొదలు పెడదామనుకున్న సమయంలో సాయిధరమ్‌ తేజ్‌ గారికి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో సినిమా పరిస్థితి ఏంటో అని మెంటల్‌గా నాకు నేను కోమాలోనే ఉన్నట్లనిపించింది. సాయితేజ్‌ గారికి అంతా బాగానే ఉందని చెప్పగానే రిలాక్స్‌ అయ్యాను. విరూపాక్ష విడుదలయ్యాక చాలామంది నిర్మాతలు ఫోన్‌ చేశారు. ఈ సినిమాను ఇతర భాషల్లో కూడా రిలీజ్‌ చేసే ఆలోచనలో ఉన్నాం అన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)