Breaking News

'కార్తీ' డబ్బింగ్‌ పనుల్లో బిజీ.. నెక్ట్స్‌ విడుదలయ్యే సినిమా ఇదే

Published on Tue, 03/11/2025 - 07:05

కోలీవుడ్‌లో ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న నటుడు కార్తీ. ఈయన ఇటీవల నటించిన 'సత్యం సుందరం' చిత్రం మంచి విజయాన్ని సాధించింది. కాగా తాజాగా కార్తీ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలలో సర్ధార్‌ 2 ఒకటి. నటుడు కార్తీ పోలీస్‌ అధికారిగా, సర్ధార్‌గా ధ్విపాత్రాభినయం చేసిన చిత్రం సర్ధార్‌. ప్రిన్స్‌ పిక్చర్స్‌ పతాకంపై లక్ష్మణన్‌ నిర్మించిన ఈ చిత్రానికి పీఎస్‌.మిత్రన్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో అదే కాంబినేషన్‌లో పార్ట్‌-2 ప్లాన్‌ చేశారు. ఇందులోనూ కార్తీ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. 

ఆయన సరసన నటి మాళవిక మోహన్‌, ఆషీకా రంగనాథ్‌, రజీషా విజయన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నటుడు ఎస్‌జే.సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న సర్ధార్‌ –2 చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. అందులో భాగంగా చిత్ర డబ్బింగ్‌ కార్యక్రమాలను ప్రారంబించారు. కాగా ప్రస్తుతం నటుడు కార్తీ ఈ చిత్రానికి డబ్బింగ్‌ చెబుతున్నారు. ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. భారీ అంచనాలు సంతరించుకున్న ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌రాజా సంగీతాన్ని, జార్జ్‌ విల్లియమ్స్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కాగా సర్ధార్‌ –2 చిత్రం త్వరలోనే తెరపైకి రానుందన్నమాట.

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)