Breaking News

కార్తీ సినిమా చూసేందుకు చెన్నై వచ్చిన జపాన్‌ ఫ్యాన్స్‌!

Published on Wed, 05/03/2023 - 09:29

దక్షిణాది సినిమాలు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాయి. ఇటీవల ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని జపాన్‌ దేశ ప్రజలు విశేషంగా ఆదరించారు. తాజాగా మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్‌, జయం రవి, కార్తీ, ఐశ్వర్యారాయ్‌, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌ కుమార్‌, ప్రభు, ప్రకాష్‌ రాజ్‌, విక్రమ్‌ ప్రభు పంటి ప్రముఖ తారాగణం నటించిన పొన్నియిన్‌ సెల్వన్‌ 2 సూపర్‌ హిట్‌ అయ్యింది. మద్రాస్‌ టాకీస్‌, లైకా ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం, రవి వర్మన్‌ ఛాయాగ్రహణం అందించారు. రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థ గత నెల 28వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది.

ఇది చారిత్రక కథ కావడంతో కొన్ని విమర్శలను ఎదుర్కొంటున్నా, సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. కాగా నటుడు కార్తీకి జపాన్‌లో కూడా అభిమానులు ఉండటం విశేషం. పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంలో వాందియదేవన్‌గా నటించిన కార్తీ మంచి ప్రశంసలు అందుకుంటున్నారు. తాజాగా జపాన్‌కు చెందిన కార్తీ అభిమానులు పొన్నియిన్‌ సెల్వన్‌– 2 చిత్రాన్ని తమిళనాడులో చూడాలన్న ఆసక్తితో చైన్నెకి రావడం విశేషం.

వారు ఈ చిత్రాన్ని ఏకంగా నాలుగు సార్లు చూశారట. ఈ విషయం తెలుసుకున్న నటుడు కార్తీ సర్‌ ప్రైజ్‌ చేసే విధంగా వారిని తన ఇంటికి రప్పించుకుని ముచ్చటించారు. ఈ సందర్భంగా జపాన్‌ అభిమానులు కార్తీ కోసం ప్రత్యేకంగా తీసుకువచ్చిన బహుమతులను ఆయనకు అందించారు. కార్తీ వారితో దిగిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

చదవండి: ఇళయరాజా కుటుంబంలో విషాదం

Videos

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)