Breaking News

కార్తీ 'జపాన్‌' సినిమాకు భారీ బిజినెస్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే!

Published on Fri, 08/04/2023 - 07:15

కోలీవుడ్‌లో పరుత్తివీరన్‌ చిత్రంతో కథానాయకుడిగా పరిచయం అయిన కార్తీ ఇప్పటికి 24 చిత్రాల్లో నటించారు. వీటిలో 90 శాతం హిట్‌ చిత్రాలు కావడం విశేషం. ఇటీవల కార్తీ నటించిన విరుమాన్‌, పొన్నియిన్‌ సెల్వన్‌, సర్దార్‌ చిత్రాలు వరుసగా విడుదలై హిట్‌ కావడంతో హ్యాట్రిక్‌ సాధించారు. కాగా తాజాగా తన 25వ చిత్రం జపాన్‌ పూర్తి చేశారు. వైవిధ్య భరిత కథా చిత్రాల దర్శకుడు రాజు మురుగన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. నటి అనూ ఇమాన్యుల్ నాయకిగా నటిస్తున్న జపాన్‌ చిత్ర టైటిల్‌కు విశేష స్పందన వచ్చింది.

(ఇదీ చదవండి: విజయ్‌ సేతుపతి సూపర్‌ హిట్‌ సినిమాకు సీక్వెల్‌ రెడీ)

అదేవిధంగా ఇందులో కార్తీ వివిధ గెటప్పులు ధరించడంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాల్లో జరుపుకుంటున్న ఈ చిత్రంలోని పాటల చిత్రీకరణ జరగాల్సి ఉంది. కాగా దీపావళి సందర్భంగా చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. కాగా విచిత్ర వ్యాపారం ట్రేడ్‌ వర్గాల్లో ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. జపాన్‌ చిత్ర ప్రీ బిజినెస్‌ మాత్రమే రు.150 కోట్లు జరిగిందని చిత్రవర్గాలు అధికారికంగా ప్రకటించాయి.

(ఇదీ చదవండి: ఫీమేల్‌ గెటప్‌లో మెప్పించేందుకు ప్లాన్‌ చేస్తున్న హీరోలు)

ఇప్పటివరకు కార్తీ నటించిన చిత్రాలన్నిటికంటే అత్యధికంగా వ్యాపారం జరిగిన చిత్రం ఇదే అవుతుంది. కాగా నటుడు కార్తీ ప్రస్తుతం తన 26వ చిత్రంలో నటిస్తున్నారు. దీనికి నలన్‌ కుమార సామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ అక్టోబర్‌లో పూర్తి అవుతుందని సమాచారం. తదుపరి 96 చిత్రం ఫ్రేమ్‌ ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో నటించనున్నారు. ఇది నవంబర్‌లో సెట్‌ పైకి వెళ్లనుంది ఆ తర్వాత కార్తీ నటించే సర్దార్‌– 2, ఖైదీ– 2 చిత్రాలు 2024లో ప్రారంభం అవుతాయని సమాచారం.

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)