Breaking News

యష్ 'టాక్సిక్' మూవీ టీమ్‌పై పోలీస్ కేసు

Published on Wed, 11/13/2024 - 10:24

'కేజీఎఫ్' ఫేమ్ యష్ ప్రస్తుతం 'టాక్సిక్' సినిమా చేస్తున్నాడు. కొన్నిరోజుల క్రితం ఊహించని వివాదంలో ఈ చిత్రబృందం చిక్కుకుంది. అన్యాయంగా వేలాది చెట్లు నరికేశారనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు అది నిజమే అనేలా కర్ణాటక అటవీ శాఖ మూవీ టీమ్‌పై పోలీస్ కేసు పెట్టింది. ఇంతకీ అసలేం జరుగుతోంది?

బెంగళూరులోని పీణ్య-జలహళ్లి దగ్గరలో యష్ 'టాక్సిక్' మూవీ షూటింగ్ చేస్తున్నారు. అయితే చిత్రీకరణ జరుగుతున్న భూమికి సంబంధించి కర్ణాటక అటవీశాఖ, హిందుస్థాన్‌ మెషిన్‌ టూల్స్‌ మధ్య వివాదం కొనసాగుతోంది. వాస్తవానికి ఈ రిజర్వ్ ఫారెస్ట్ భూములని గెజిట్‌లో ఎలాంటి అధికారిక నోటిఫికేషన్ లేకుండానే హెచ్‌ఎంటీకి ఇచ్చారు. భూమి యాజమాన్య హక్కులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తగాదా నడుస్తోంది.

(ఇదీ చదవండి: ఎన్నికల ప్రచారంలో ప్రముఖ నటుడి పర్స్ కొట్టేశారు)

కానీ వ్యాపార అవసరాల కోసం హెచ్‌ఎంటీ భూమిని అద్దెకు ఇస్తోంది. ఈ క్రమంలోనే 'టాక్సిక్' చిత్రబృందం కొన్నిరోజుల కోసమా అని లీజుకు తీసుకుంది. కానీ సెట్స్ వేసేందుకు వందలాది ఎకరాల అటవీ భూమిలోని చెట్లను నరికివేశారని విమర్శలొచ్చాయి. స్వయంగా అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే.. ఆ ప్రాంతాన్ని సందర్శించి మరీ శాటిలైట్ ఫొటోలు తన ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. అనుమతి లేకుండా చెట్లను నరికడం, అటవీ చట్టాన్ని ఉల్లంఘించినట్లేనని, శిక్షార్హమైన నేరమని మంత్రి పేర్కొన్నారు.

ఇది జరిగి కొన్నిరోజులు అవుతుండగా కర్ణాటక అటవీశాఖ ఇప్పుడు సీరియస్ అయింది. టాక్సిక్‌ మూవీ నిర్మాతలపై కేసు పెట్టింది. అలాగే కెనరా బ్యాంక్‌ జనరల్‌ మేనేజర్‌, హిందుస్థాన్‌ మెషిన్‌ టూల్స్‌ జనరల్‌ మేనేజర్‌పైన కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఇప్పుడీ విషయం కన్నడ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తండ్రి సెంటిమెంట్ తెలుగు సినిమా)

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)