Breaking News

ఆ విషయంలోనే మాకు తరచూ గొడవలు: కరీనా

Published on Sat, 07/20/2024 - 13:38

బాలీవుడ్‌ జంట కరీనా కపూర్‌- సైఫ్‌ అలీ ఖాన్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు చిన్నారులు జన్మించారు. పెళ్లి తర్వాత తాను ఎంతగానో మారిపోయానంటోంది కరీనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'వివాహం నన్ను మార్చివేసింది. బాధ్యతగా ఉండటం తెలిసొచ్చింది. మేము ఒకరికొకరం తినిపించుకునేవాళ్లం. పోట్లాడుకునేవాళ్లం. కానీ మాకంటూ పెద్దగా సమయం కేటాయించుకోకపోయేవాళ్లం. 

ఒకే ఇంట్లో ఉన్నా..
సైఫ్‌ ఒక్కోసారి ఉదయం 4.30 గంటలకు వచ్చి నిద్రపోయేవాడు. తను లేచేసరికి నేను షూట్‌కు  వెళ్లిపోయేదాన్ని. నేనొచ్చేసరికి తను ఉండేవాడు కాదు. ఒకే ఇంట్లో ఉన్నా ఇద్దరం మాట్లాడుకునే పరిస్థితి లేకపోయేది. ఒక ఇంట్లో ఇద్దరు నటులు ఉంటే ఇలాగే ఉంటుంది. నేను తన సినిమాలన్నీ చూస్తాను. కానీ ఆయన మాత్రం నేను నటించిన క్రూ మూవీ కూడా ఇంతవరకు చూడలేదు. ఎప్పుడూ షూటింగ్స్‌ అంటూ తిరుగుతూనే ఉంటాడు.

ఏసీ దగ్గరే గొడవ
మా ఇద్దరికీ ఏసీ గురించే గొడవలవుతుంటాయి. తనకేమో కూలింగ్‌ ఎక్కువ కావాలంటాడు. నేనేమో 20 డిగ్రీలు చాలంటాను. ఇద్దరి మాటా కాదని 19 డిగ్రీల టెంపరేచర్‌ సెట్‌ చేస్తాడు. నా సోదరి కరిష్మా వచ్చినప్పుడు ఏసీ 25 డిగ్రీల నెంబర్‌లో పెట్టేస్తాం. అప్పుడైతే.. తనకంటే నేనే నయమని ఫీలవుతాడు. అలాగే టైం విషయంలో గొడవడపతాం. డబ్బు, వస్తువుల కోసం మేము పోట్లాడుకోం. ఇద్దరం కలిసి కాసేపు సరదాగా మాట్లాడుకుంటే చాలని భావిస్తాం. కాస్త సమయం దొరికితే కలిసుండాలని ఆరాటపడతాం' అని చెప్పుకొచ్చింది. 

సినిమా..
కాగా సైఫ్‌ అలీ ఖాన్‌ గతంలో అమృత సింగ్‌ను పెళ్లాడగా వీరికి సారా అనే కూతురు, ఇబ్రహీం అనే కుమారుడు సంతానం. అమృతకు విడాకులిచ్చిన ఎనిమిదేళ్ల తర్వాత 2012లో కరీనాను పెళ్లాడాడు. ఇకపోతే సైఫ్‌ ప్రస్తుతం 'దేవర' సినిమాలో నటిస్తుండగా కరీనా 'ద బకింగ్‌హామ్‌ మర్డర్స్‌' మూవీ చేస్తోంది.

చదవండి: ఆ హీరోయిన్‌కు యాక్టింగ్‌ రాదు, తీసుకోవద్దన్నారు: డైరెక్టర్‌

Videos

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు