Breaking News

పిల్లలు కావాలని హీరోను పెళ్లి చేసుకున్నా: స్టార్‌ హీరోయిన్‌

Published on Tue, 11/14/2023 - 11:21

స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ ఇద్దరు పిల్ల తల్లి.. ఓ పక్క కుటుంబ వ్యవహారాలు చూసుకుంటూనే మరో పక్క సినిమాలు చేస్తోంది. అటు నిర్మాతగా, ఇటు హీరోయిన్‌గా రాణిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. 'ఈ కాలంలో పిల్లల్ని కనడం కోసమే పెళ్లి చేసుకుంటున్నారు. అంతే కదా! పిల్లల గురించి ఆలోచించకపోతే వివాహ బంధంలో అడుగుపెట్టకుండా సహజీవనం చేయొచ్చు. నేను, సైఫ్‌ అలీ ఖాన్‌ చేసిందదే.. మేమిద్దరం ఐదేళ్లపాటు సహజీవనం చేశాం. పిల్లలు కావాలనుకున్నప్పుడే పెళ్లి చేసుకున్నాం' అని చెప్పుకొచ్చింది. 

కొంతకాలం డేటింగ్‌.. తర్వాతే పెళ్లి
కాగా సైఫ్‌ అలీ ఖాన్‌ గతంలో అమృత సింగ్‌ను పెళ్లాడాడు. వీరికి సారా అలీ ఖాన్‌, ఇబ్రహీమ్‌ అలీ ఖాన్‌ సంతానం. దంపతుల మధ్య పొరపచ్చాలు రావడంతో వీరు 2004లో విడిపోయారు. తర్వాత హీరోయిన్‌ కరీనాతో ప్రేమలో పడ్డాడు సైఫ్‌. కొన్నేళ్లపాటు డేటింగ్‌లో ఉన్న ఈ లవ్‌ బర్డ్స్‌ 2012 అక్టోబర్‌లో పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా మారారు. వీరికి 2016లో తైమూర్‌, 2021లో జహంగీర్‌ జన్మించారు.

ఓటీటీలోనూ ఎంట్రీ
ఇక సినిమాల విషయానికి వస్తే కరీనా కపూర్‌ ఇటీవలే ఓటీటీలోనూ అడుగుపెట్టింది. సస్పెక్ట్‌ ఎక్స్‌ అనే  జపనీస్‌ నవల ఆధారంగా తెరకెక్కిన జానే జాన్‌ సినిమాలో నటించింది. సుజయ్‌ ఘోష్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇందులో విజయ్‌ వర్మ, జైదీప్‌ అహ్లావత్‌ కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఆమె చేతిలో ద క్య్రూ, సింగం అగైన్‌ అనే సినిమాలున్నాయి.

చదవండి: సినీ రచయిత కన్నుమూత.. పాఠశాల దశలోనే చదువు ఆగిపోయినా..

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)