Breaking News

స్టార్ హీరోయిన్‌కి హైకోర్టు నుంచి నోటీసులు.. కారణం ఏంటంటే?

Published on Sat, 05/11/2024 - 15:12

కొన్నిసార్లు ఊహించని విధంగా చిక్కులు ఎదురవుతుంటాయి. అలా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్‌కి మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఓ విషయంలో చిన్న పదం ఉపయోగించినందుకుగానూ ఈ పరిస్థితి ఎదురైంది. ఇప్పుడీ విషయం కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయింది. ఇంతకీ అసలేం జరిగింది?

(ఇదీ చదవండి: చిక్కుల్లో హీరో శింబు.. కమల్‌ హాసన్‌ మూవీలో నటించడానికి వీల్లేదంటూ..)

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో కరీనా కపూర్ ఒకరు. స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌ని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లయింది. ఈ క్రమంలోనే తన ప్రెగ్నెన్సీ అనుభవాలతో 'కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్' పేరుతో ఓ పుస్తకం రాసింది. అయితే ఈ బుక్ టైటిల్‌లో 'బైబిల్' పదాన్ని ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ లాయర్ క్రిస్టోఫర్ ఆంథోని కోర్టుని ఆశ్రయించారు. జస్టిస్ గురుపాల్ సింగ్ అహ్లువాలియా నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ కరీనాకు నోటీసు జారీ చేసింది. ఆ పదం వాడటానికి గల కారణమేంటని ప్రశ్నించింది.

కరీనా కపూర్‪‌పై కేసు కూడా నమోదు చేయాలని క్రిస్టోపర్ పిటిషన్ వేశారు. ఈ పుస్తకాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. బుక్ టైటిల్‌లోని 'బైబిల్' పదం వల్ల క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసినట్లు అవుతుందని ఆంథోనీ తన పిటీషన్‌లో పేర్కొన్నారు. క్రైస్తవులకు బైబిల్ అనేది పవిత్ర గ్రంథం అని, కరీనా కపూర్ తన ప్రెగ్నెన్సీని బైబిల్‌తో పోల్చడం సరికాదు అని ఆయన చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: వైఎస్సార్సీపీ అభ్యర్థి కోసం ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్‌.. ఇదెక్కడి క్రేజ్ రా మావ)

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)