Breaking News

తెలుగులో ‘కరాటే కిడ్‌: లెజెండ్స్’.. ట్రైలర్‌ రిలీజ్‌

Published on Wed, 04/02/2025 - 16:08

ఇండియాలో అత్యంత ప్రాచుర్య పొందిన ఫ్రాంచైజీలలో ఒకటైన కరాటే కిడ్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కొత్త భాగం కరాటే కిడ్‌: లెజెండ్స్(Karate Kid: Legendత) కొత్త ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం 2025 మే 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. కరాటే కిడ్ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు లేని విధంగా, ఈ ఆరవ భాగంలో రెండు ఐకానిక్‌ పాత్రలు — జాకీ చాన్ (Mr. Han) మరియు రాల్ఫ్ మాకియో (Daniel LaRusso) కలిసి తొలిసారి స్క్రీన్‌పై కనిపించనున్నారు. ట్రైలర్‌లో  ఆ పాత్ర కు వారు కష్టపడిన  విధానం, వారి శిక్షణ,  మిస్టర్ మియాగీ లెగసీకి ఘన నివాళిని కూడా అందించడం మీరు ఈ ట్రైలర్‌లో చూశారు.

ఈ కథ లీ ఫాంగ్ (బెన్ వాంగ్) అనే కుంగ్‌ ఫూ ప్రతిభావంతుడిని కేంద్రంగా సాగుతుంది. అతడు తన తల్లితో కలిసి న్యూయార్క్‌ నగరానికి వచ్చి ఓ ప్రసిద్ధ  పాఠశాలలో చేరతాడు. అక్కడ ఒక విద్యార్థిని, ఆమె తండ్రితో స్నేహం ఏర్పడుతుంది. అయితే ఒక లోకల్‌ కరాటే చాంపియన్‌తో గొడవలు మొదలవ్వడం అతని జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఆ తరువాత జరిగిందేమిటి అనేది ఆసక్తికరంగా ఉంటుంది.

తనను తానే రక్షించుకోవాలనే ఉద్దేశంతో, లీ ఫాంగ్‌ కుంగ్‌ ఫూ గురువు మిస్టర్ హాన్ మరియు లెజెండరీ కరాటే కిడ్ డేనియల్ లారూసోల నుంచి శిక్షణ తీసుకుంటాడు. ఇద్దరి శైలి మిళితంతో అతడు ఓ అద్భుతమైన మార్షల్ ఆర్ట్స్‌ పోరుకు సిద్ధమవుతాడు. ఈ ఏపిసోడ్‌ అందర్ని ఎంతో అలరించే విధంగా ఉంటుంది. జొనథన్ ఎన్‌ట్‌విసిల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాకీ చాన్, రాల్ఫ్ మాకియో, బెన్ వాంగ్, జోషువా జాక్సన్, సేడీ స్టాన్లీ, మరియు మింగ్-నా వెన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)