Breaking News

మా సస్పెన్షన్.. కరాటే కల్యాణ్ రియాక్షన్ ఇదే!

Published on Fri, 05/26/2023 - 17:14

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ నుంచి సస్పెండ్‌ చేయడంపై నటి కరాటే కల్యాణి రియాక్ట్ అయ్యారు. సినీ పరిశ్రమ కోసం తాను పడిన కష్టానికి బాగా బుద్ధి చెప్పారని అన్నారు. మా సస్పెండ్ చేయడంతో చాలా బాధపడ్డానని తెలిపారు. మాపై ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. తన నిజాయితీకి ఇచ్చే బహుమతి ఇదేనా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

(ఇది చదవండి: శ్రీలీలను కొట్టిన బాలకృష్ణ! అసలేం జరిగిందంటే?)

కాగా.. ఖమ్మంలోని లకారం ట్యాంక్‌బండ్‌పై సీనియర్ ఎన్టీఆర్ విగ్రహా ఏ‍ర్పాటుపై ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో మా చర్యలు చేపట్టింది.  ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా ‘మా’ షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చింది. 

(ఇది చదవండి: తిరుమలకు నిహారిక భర్త.. మళ్లీ మొదలైన చర్చ!)

కరాటే కల్యాణి మాట్లాడుతూ..' 23 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా. ఎవరు, ఎప్పుడు, ఏం మాట్లాడినా నేనే అడ్డుపడినా. పూసుకుని, రాసుకుని నా ఇండస్ట్రీ, నా ఇండస్ట్రీ అనుకుని వెళ్లా. అలా వెళ్లినందుకు నా నిజాయతీకి తగిన బగుమతి దక్కింది. నేను ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టమనే అడిగాను. వ్యతిరేకించట్లేదు. కృష్ణుడి రూపంలో వద్దని చెప్పా. దీనికి నా మీద ఎందుకు కక్ష కడుతున్నారు. నా ఆరోగ్యం బాగోలేక సమాధానం ఇవ్వలేకపోయా. మూడు రోజులు మాత్రమే గడువిచ్చారు. కనీసం వారం రోజులు కావాలని నోటీసు కూడా ఇచ్చా. అందుకే నన్ను సస్పెండ్‌ చేశారు. నాకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం లేదు. మా అసోసియేషన్‌ను కించపరచలేదు. నేను ఏ తప్పూ చేయలేదు. బహుశా ఎవరి ఒత్తిడితోనైనా ఆ నిర్ణయం తీసుకున్నారేమో తెలియదు.' అని చెప్పుకొచ్చారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)