Breaking News

నటుడికి క్యాన్సర్‌ నాలుగో స్టేజ్‌.. ఆదుకోమని వేడుకోలు..

Published on Fri, 04/18/2025 - 16:00

బుల్లితెర నటుడు విభు రాఘవ్‌ (VIBHU k RAGHAVE) పెద్ద పేగు క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. ప్రస్తుతం అతడికి క్యాన్సర్‌ నాలుగో స్టేజీలో ఉంది. దీనికి ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అతడికి చేతనైనంత సాయం చేద్దామని పిలుపునిచ్చాడు హిందీ బిగ్‌బాస్‌ 18 విన్నర్‌, నటుడు కరణ్‌ వీర్‌ మెహ్రా. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఓ పోస్ట్‌ పెట్టాడు. మన స్నేహితుడు విభుకి క్యాన్సర్‌ నాలుగో స్టేజీలో ఉంది. ముంబైలోని టాటా ఆస్పత్రిలో తను చికిత్స పొందుతున్నాడు. 

దయచేసి..
ప్రస్తుతం కీమోథెరపీ జరుగుతోంది. చికిత్స కోసం పెద్దమొత్తంలో డబ్బు ఖర్చవుతోంది. దయచేసి మీకు తోచినంత సాయం చేయండి. ఇంతకుముందు కూడా మీరు సాయం చేశారు. మరోసారి కూడా సాయం చేసేందుకు ముందుకువస్తారని ఆశిస్తున్నాను. తన ట్రీట్‌మెంట్‌ సజావుగా సాగేందుకు తోడ్పడండి. అలాగే తను కోలుకోవాలని ప్రార్థించండి అని కోరాడు. అనుపమ సీరియల్‌ నటి అనేరి విజాని సైతం.. విభుకు ఆర్థిక సాయం చేయమని అర్థించింది.

ఒక్కరోజులో జీవితమే తలకిందులు
కాగా 2022లో రాఘవ్‌ క్యాన్సర్‌ బారిన పడినట్లు ప్రకటించాడు. "నేను ఆస్పత్రిలో ఉన్నాను. నా పరిస్థితి మీకందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. కొద్ది రోజులుగా నా ఆరోగ్యం ఏమీ బాగోలేదు. రెండువారాల క్రితం నాకు క్యాన్సర్‌ నాలుగో దశలో ఉందని తెలిసింది. ఇది నేను ఊహించలేదు. ఒక్క రోజులో నా జీవితమే తలకిందులైంది. ధైర్యంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను" అని పోస్ట్‌ పెట్టాడు. విభు.. సవ్రీన్‌ గుగ్గల్‌: టాపర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ సీరియల్‌లో నటించాడు. రిథమ్‌, పిచ్‌ఫోర్క్‌ సినిమాల్లోనూ యాక్ట్‌ చేశాడు.

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)