Breaking News

కాంతార ప్రీక్వెల్... రంగంలోకి నేషనల్ అవార్డ్ సింగర్!

Published on Sun, 09/14/2025 - 16:24

కన్నడ ఇండస్ట్రీలో నుంచి బ్లాక్‌బస్టర్‌ మూవీ కాంతార. ఈ సినిమాను రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రం కర్ణాటకలోనే కాకుండా అన్ని దేశవ్యాప్తంగా అనూహ్య విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని హోంబలే సంస్థ నిర్మించిన విషయం తెలిసిందే. కాగా.. తాజాగా ఆ చిత్రానికి ప్రీక్వెల్‌గా కాంతారా చాప్టర్‌– 1 పేరుతో అత్యంత భారీ బడ్జెట్‌లో  రూపొందిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తయిన ఈ సినిమా దసరా కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక పాటను ఇటీవల రికార్డ్‌ చేశారు.

ఈ సాంగ్‌ను జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత నటుడు, గాయకుడు దిల్జిత్‌ దోసాంజ్‌ పాడడం విశేషం. ఈ సందర్భంగా ఈయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాంతార వంటి అద్భుతమైన చిత్రాన్ని రూపొందించిన తన సోదరుడు రిషబ్‌ శెట్టికి తన ప్రణామాలు అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి తనకు ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు. అదేమిటి అన్నది ఇప్పుడే చెప్పలేనని అయితే వారాహరూపం అనే పాట ధ్వనిస్తున్నప్పుడు మాత్రం ఆనందభాష్వాలు వచ్చాయన్నారు. ఇకపోతే త్వరలో తెరపైకి రానున్న కాంతార చాప్టర్‌ –1 లో పాడిన అనుభవం మరువలేనిదన్నారు.

ఈ సందర్భంగా ఈ చిత్ర సంగీత దర్శకుడు బి. అజనీష్‌ లోకనాథ్‌ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అని అన్నారు. ఒక్క రోజులోనే ఆయన నుంచి తాను చాలా నేర్చుకున్నట్లు చెప్పారు. దీంతో నటుడు దర్శకుడు రిషబ్‌ శెట్టి, గాయకుడు దిల్జిత్‌ దోసాంజ్‌, హోంబలే ఫిల్మ్స్‌ కాంబోలో రూపొందిన ఈ చిత్ర ఆల్బమ్‌పై ఆసక్తి నెలకొంది. కాగా ఈ చిత్రం అక్టోబర్‌ రెండో తేదీన ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. 
 

 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి