Breaking News

'కాంతార' షూటింగ్ లో మరో అపశృతి

Published on Wed, 05/07/2025 - 14:29

'కాంతార' పేరు చెప్పగానే సదరు సినిమాలోని క్లైమాక్సే మీకు గుర్తొస్తుంది కదా? ఎందుకంటే 2022లో రిలీజైన ఈ చిత్రం.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనికి సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించారు. చాన్నాళ్లుగా షూటింగ్ చేస్తున్నారు. ఇదివరకే ప్రమాదాలు చోటుచేసుకోగా ఇప్పుడు మరో అపశృతి జరిగింది.

కన్నడ హీరో రిషభ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'కాంతార చాప్టర్ 1'. ఇదివరకే వచ్చింది రెండో పార్ట్ కాగా.. చిత్రీకరణ జరుపుకొంటున్నది తొలి పార్ట్. ఏ క్షణాన షూటింగ్ మొదలైందో గానీ ఏదో ఓ ప్రమాదం చోటుచేసుకుంటూనే ఉంది. ఒకటి రెండు కాదు చాలానే ప్రమాదాలు, ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి.

(ఇదీ చదవండి: పవన్ 'హరిహర వీరమల్లు'.. అంతా ఓటీటీ దయ!)

తాజాగా జరిగిన సంఘటన గురించి చెప్పుకొంటే.. ఉడుపి జిల్లా కొల్లూరులో దగ్గర షూటింగ్ చేస్తున్నారు. ఈ మూవీ జూనియర్ ఆర్టిస్ట్ గా కేరళకు చెందిన కపిల్ చేస్తున్నాడు. మంగళవారం ఉదయం చిత్రీకరణ పూర్తవడంతో దగ్గరలోని సౌపర్ణిక నదిలో ఈతకు దిగాడు. లోతు ఎక్కువుండేసరికి నీట ముగిని చనిపోయాడు. దీంతో విషాదం నెలకొంది.

అంతకు ముందు కూడా 'కాంతార' టీమ్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. కొన్నిరోజుల క్రితం కొల్లూరులో జూనియర్ ఆర్టిస్టులతో వెళ్తున్న బస్ బోల్తా పడింది. ఈ ఘటనలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఓసారి పెద్ద గాలివానకు భారీ ఖర్చుతో నిర్మించిన సెట్ ధ్వంసమైంది. అలానే కొన్నిరోజుల క్రితం పంజుర్లీ దేవర హీరో,డైరెక్టర్ రిషభ్ శెట్టిని హెచ్చరించింది. నువ్వు ప్రమాదంలో ఉన్నావ్, నీ చుట్టుపక్క వాళ్ల దగ్గరనుంచి నుంచే ఇది పొంచి ఉందని చెప్పుకొచ్చింది. ఇవన్నీ చూస్తుంటే అసలేం జరుగుతుందా అని సందేహాలు వస్తున్నాయి.

(ఇదీ చదవండి: ‍మహేశ్ ఇంట్లో మరో హీరో రెడీ.. అన్నీ ఫిక్స్!)

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)