Breaking News

‘కాంతార’ కథ వెనుక పెద్ద కథే ఉందిగా!

Published on Sun, 10/05/2025 - 18:16

రిషబ్‌ శెట్టి(Rishab Shetty ) దర్శకత్వం వహించి, నటించిన ‘కాంతార చాప్టర్‌ 1’(Kantara: Chapter 1)ఇప్పుడు బాక్సాఫీస్‌ని షేక్‌ చేస్తుంది. విడుదలైన తొలి రోజే(అక్టోబర్‌ 2) ఈ చిత్రం రూ. 89 కోట్ల మేర వసూళ్లను సాధించింది. వీకెండ్‌లోగా రూ. 300 కోట్లు ఈజీగా రాబడుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంతార మాదిరే ప్రీక్వెల్‌గా వచ్చిన కాంతార చాప్టర్‌ 1 కూడా సూపర్‌ హిట్‌ కావడం పట్ల రిషబ్‌ శెట్టి ఆనందం వ్యక్తం చేశాడు. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అసలు ఈ కథ రాయాలనే ఆలోచన ఎలా వచ్చిందో వివరించాడు. తన ఊర్లో జరిగిన ఓ గొడవే ఈ సినిమా కథను రాసేలా చేసిందని ఆయన చెప్పారు.

 ‘20 ఏళ్ల క్రితం మా గ్రామంలో జరిగిన ఓ సంఘటన ‘కాంతార’ కథకు పునాది వేసింది. వ్యవసాయ భూమి కోసం ఒక రైతు, అటవీ శాఖ అధికారి మధ్య ఘర్షణ జరిగింది. అది నాకు ఇద్దరి మనుషుల మధ్య గొడవలా అనిపించలేదు. ప్రకృతిని కాపాడే వారి మధ్య ఘర్షణలా చూశాను. ఈ అంశంతోనే కథను రాయాలనుకున్నాను. 

మన సంస్కృతి మొత్తం వ్యవసాయం చుట్టూ ఎలా తిరుగుతుందో ఆలోచించడం ప్రారంభించాను. ఈ క్రమంలో గ్రామీణ ప్రజల సంప్రదాయాలపై దృష్టి పెట్టి ‘కాంతార’ కథను రాశాను’ అని రిషబ్‌ చెప్పుకొచ్చాడు. కాంతార, కాంతార చాప్టర్‌ 1 కథలు కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతల్లో ప్రసిద్ధి చెందిన భూతకోల నేపథ్యంలో సాగుతుందన్న సంగతి తెలిసిందే.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)