Breaking News

కాంతార కోసం వస్తున్న ఎన్టీఆర్‌.. జోష్‌లో ఫ్యాన్స్‌

Published on Sat, 09/27/2025 - 08:32

‘కాంతార:చాప్టర్‌1’ (Kantara Chapter 1) ట్రైలర్‌ దుమ్మురేపుతుంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో ఏకంగా 150 మిలియన్ల వ్యూస్‌ దాటేసింది. అక్టోబర్‌ 2న  ఈ సినిమా విడుదల కానున్నడంతో ప్రమోషన్స్‌ విషయంలో కూడా చిత్ర యూనిట్‌ జోరు పెంచింది. కన్నడ ప్రాంతీయ చిత్రంగా విడుదలైన కాంతార తెలుగులో కూడా భారీ కలెక్షన్స్‌ రాబట్టింది. దీంతో టాలీవుడ్‌ ప్రేక్షకులు కూడా ప్రీక్వెల్‌ కోసం  ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, తాజాగా ఈ సినిమా  ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూనియర్‌ ఎన్టీఆర్‌ రావడం విశేషం.

ఎన్టీఆర్‌, రిషబ్ శెట్టి మధ్య స్నేహబంధం ఉంది. ఇటీవల, జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబంతో కలిసి కర్ణాటకలోని ఉడిపిని సందర్శించినప్పుడు రిషబ్ శెట్టి వారికి ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సెప్టెంబర్‌ 28న జరిగే కాంతార ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా వస్తున్నారు. హైదరాబాద్‌లోని జెఆర్సీ కన్వెన్షన్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. కార్యక్రమానికి సంబంధించిన ఒక పోస్టర్‌ను చిత్ర మేకర్స్‌ విడుదల చేశారు.

కాంతార చాఫ్టర్ 1లో రిషబ్‌ శెట్టి నటిస్తూనే దర్శకత్వం కూడా వహించారు. ఈ సినిమాలో  రుక్మిణి వసంత హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలతో పాటు  ఇంగ్లీష్‌ వెర్షన్‌ను కూడా విడుదల చేస్తున్నారు. దక్షిణ అమెరికాలో ఫస్ట్‌ పార్ట్‌కు ఆదరణ దక్కడంతో  ప్రీక్వెల్‌ను స్పానిష్‌లో డబ్‌ చేసి విడుదల చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 7వేలకు పైగా స్క్రీన్‌లలో ‘కాంతార: చాప్టర్‌1’ను విడుదల చేయనున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)