Breaking News

'కాంతార'లో నవ్వించిన ఈ నటుడు ఎలా మరణించాడో తెలుసా?

Published on Mon, 10/06/2025 - 12:32

కాంతార చాప్టర్‌-1 సినిమా చూసిన వారందరూ నటుడు రాకేశ్‌ పూజారి (34) (Rakesh Poojary) గురించి ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఆయన గురించి తెలుసుకునేందుకు ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే, ఆయన ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే మరణించారు. దీంతో చిత్ర యూనిట్‌ కూడా  ఆ సమయంలో సంతాపం తెలిపింది.

ఈ ఏడాది మే 13న రాకేశ్‌ పూజారి గుండెపోటుతో మరణించారు. కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో తన సన్నిహితులు నిర్వహించిన ఓ మెహందీ వేడుకలో ఆయన పాల్గొన్నారు. అక్కడ డ్యాన్స్‌ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆసుపత్రిలో చేర్పించేలోపే ఆయన మరణించారు. కన్నడలో ప్రముఖ టెవిలిజన్‌ షో ‘కామెడీ ఖిలాడిగలు’ సీజన్‌ 3 విన్నర్‌గా ఆయన నిలిచాడు. దీంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాకేశ్‌కు చాలా సినిమా ఛాన్సులు దక్కాయి. కన్నడ, తుళు భాషల్లోని పలు సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. అయితే, ‘కాంతార చాప్టర్‌-1’లో తన పాత్ర చిత్రీకరణను పూర్తి చేసిన తర్వాతే ఆయన మరణించారు. ఇప్పుడు ఈ సినిమా చూసిన వారికి రాకేశ్‌ పూజారి పాత్ర గుర్తిండిపోయేలా ఉండటంతో అతని గురించి ఆరా తీస్తున్నారు. అయితే, రాకేశ్‌ పూజారి పాత్రకు తెలుగు వాయిస్‌ డబ్బింగ్‌ కమెడియన్‌ బబ్లూ చెప్పారు.

కాంతార చిత్రానికి ప్రీక్వెల్‌గా ‘కాంతార చాప్టర్‌ 1’ అక్టోబర్‌ 2న విడుదలైంది. కేవలం నాలుగురోజుల్లోనే  రూ.300 కోట్ల క్లబ్‌లో చేరింది.  అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల జాబితాలో ఈ చిత్రం చోటు సంపాదించుకుంది. స్వీయ దర్శకత్వంలో రిషబ్‌శెట్టి  హీరోగా నటించగా.. రుక్మిణీ వసంత్‌, గుల్షన్‌ దేవయ్య కీలక పాత్రలలో కనిపించారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)