Breaking News

కేజీయఫ్‌ ఓ చెత్త సినిమా: ‘కాంతార’ నటుడు సంచలన కామెంట్స్‌

Published on Fri, 01/06/2023 - 12:47

కేజీయఫ్‌ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన కేజీయఫ్‌ చాప్టర్‌ 1 ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు చేసి రికార్డు సృష్టించింది. దీనికి సీక్వెల్‌గా గతేడాది విడుదలైన కేజీయఫ్‌ చాప్టర్‌ 2 కలెక్షన్ల సునామీ సృష్టించింది. చెప్పాలంటే కన్నడ చిత్ర పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా ఇది. వరల్డ్‌ వైడ్‌ దాదాపు రూ. 12 50 కోట్లు పైగా వసూళు చేసింది. ఈ చిత్రంతో హోంబాలే ఫిలింస్‌ నిర్మాణ సంస్థ మంచి గుర్తింపు వచ్చింది. 

చదవండి: రూ. 100 కోట్ల క్లబ్‌లోకి ధమాకా.. రవితేజ కెరీర్‌లోనే తొలి రికార్డు!

ఇక ఇదే బ్యానర్లో వచ్చి మరో సంచలనం సృష్టించిన సినిమా కాంతార. ఓ ప్రాంతీయ చిత్రంగా వచ్చి పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చిచుకుంది. కేవలం రూ. 16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈచిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ. 400 కోట్లు సాధించింది. తాజాగా ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన నటుడు కిశోర్‌ కుమార్‌ కేజీయఫ్‌ మూవీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కేజీయఫ్‌ ఓ చెత్త సినిమా అని పేర్కొన్నాడు. రీసెంట్‌గా ఓ బాలీవుడ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో అతడు మాట్లాడుతూ.. కేజీయఫ్‌ చిత్రంపై షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. 

చదవండి: అందుకే నా ట్విటర్‌ అకౌంట్‌ను నిలిపివేశారు: నటుడు

కాంతారతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు కేజీయఫ్‌ మూవీపై ప్రశ్న ఎందురైంది. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘కేజీయఫ్‌ మూవీ నేను ఇంతవరకు చూడలేదు. ఇది సరైన పోలికో కాదో తెలియదు. అది నా టైప్ సినిమా కాదు. ఇది నా వ్యక్తిగత విషయం. ఇలాంటి ఓ చెత్త సినిమా కంటే పెద్దగా సక్సెస్ కానీ సీరియస్ అంశాన్ని డీల్ చేసే ఓ చిన్న సినిమా చూస్తాను ’ అంటూ తన అభిప్రాయం చెప్పుకొచ్చాడు. కాగా తెలుగులో ‘హ్యాపీ’,  నాని ‘భీమిలి కబడ్డీ జట్టు’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కిశోర్‌ కుమార్‌ రీసెంట్‌గా పొన్నియన్ సెల్వన్, కాంతార, షీ వెబ్ సిరీస్ సీజన్ 2లో నటించాడు. ప్రస్తుతం ‘రెడ్ కాలర్’ అనే హిందీ సినిమా చేస్తున్నాడు.

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)