Breaking News

తెలుగు సీరియల్‌.. నా కూతురికి నరకం చూపించారు: చైల్డ్‌ ఆర్టిస్ట్‌ తల్లి

Published on Thu, 09/11/2025 - 15:45

ఓ తెలుగు సీరియల్‌ వల్ల తన కూతురు నరకం చూసిందంటోంది చైల్డ్‌ ఆర్టిస్ట్‌ నిషిత (Nishita) తల్లి ప్రియ. అందుకు సంబంధించిన సాక్ష్యాలను సైతం బయటపెట్టింది. సెట్‌లో చిన్నారికి కరెంట్‌ షాక్‌ కొట్టిందని, ఆరోగ్యం బాగోలేకపోయినా షూటింగ్‌ చేయించారని వాపోయింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో రిలీజ్‌ చేసింది.

చిన్నారికి కరెంట్‌ షాక్‌
'అందులో నిషితను గార్డెన్‌ ఏరియాలో లైట్స్‌ ఉన్న దగ్గర పడుకోబెట్టారు. అక్కడున్న లైట్స్‌ ద్వారా కరెంట్‌ షాక్‌ రావడంతో ఆ పాప నిస్సహాయ స్థితిలో కేకలేసింది. మరో సీన్‌లో తను భయపడుతున్నా సరే బలవంతంగా స్విమ్మింగ్‌ పూల్‌లోకి లాగారు. అక్కడ తనకోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? కొన్నిసార్లు ఆరోగ్యం బాగోలేక బెడ్‌పై ఉన్నా సరే.. తనకు విశ్రాంతి ఇవ్వకుండా షూటింగ్‌కు రమ్మని ఒత్తిడి తెచ్చారు. అనారోగ్యంతోనే తను సెట్‌కు వచ్చి షూట్‌ చేయాల్సి వచ్చింది. 

రెమ్యునరేషన్‌ ఆపేశారు
చిన్నపాప అని ఆలోచించకుండా రాత్రిపూట షూటింగ్స్‌కు రమ్మనేవారు. సీరియల్‌ నిర్మాతలు చైల్డ్‌ ఆర్టిస్టుల పట్ల ఇలాగే ప్రవర్తిస్తారా? అలాగే వీరు ఏప్రిల్‌ నుంచి రెమ్యునరేషన్‌ ఇవ్వకుండా ఆపేశారు. పని చేయించుకున్నారు, కానీ డబ్బులివ్వలేదు. దాదాపు 150 ఎపిసోడ్ల తర్వాత సడన్‌గా నా కూతురిని తొలగించి మరొకరిని తీసుకున్నారు. తనకు ఒంట్లో బాగోలేకపోయినా, ఎంత ఇబ్బందిపడ్డా సరే అవన్నీ ఓర్చుకుని పని చేసింది. చివరకు ఇదా మీరు తనకిచ్చే బహుమతి?

టీఆర్పీ కోసం వాడుకున్నారు
మీరు నా కూతురిని రీప్లేస్‌ చేయగలరేమో కానీ తన టాలెంట్‌ను కాదు. టీఆర్పీ కోసం నెలల తరబడి తనను వాడుకున్నారు. ఇప్పుడేమో ఎక్స్‌పెన్సివ్‌ కిడ్‌ అని పక్కన పెట్టేశారు. ఈ సీరియల్‌ కోసమే ఎన్నో ప్రాజెక్టులను కాదనుకున్నాం. ఇప్పుడు ఒక్క మాటైనా చెప్పకుండా తీసేశారు' అని నిషిత తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. కాగా నిషిత.. కన్నడంలో లక్ష్మీ నివాస సీరియల్‌లో నటించింది. ఇందులో పోషించిన ఖుషి పాత్రతో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది.

 

 

 

చదవండి: హౌస్‌ మొత్తాన్ని అల్లాడించేసిన సంజనా, ఇప్పుడేకంగా కెప్టెన్‌!

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)