రష్మికని హింసించకండి.. నటి రమ్య కౌంటర్

Published on Sat, 03/08/2025 - 16:37

రష్మిక ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్. భాషతో సంబంధం లేకుండా మూవీస్ చేస్తూ దూసుకుపోతోంది. కానీ ఈమెపై సొంత రాష్ట్రం కర్ణాటకలోనే తీవ్రమైన ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. మొన్నటిమొన్న కాంగ్రెస్ నాయకుడు కూడా రష్మికపై నోరు పారేసుకున్నాడు. ఈ క్రమంలోనే రష్మికపై జరుగుతున్న ట్రోలింగ్ పై కన్నడ నటి రమ్య స్పందించింది. విమర్శకులకు కౌంటర్ ఇచ్చింది.

(ఇదీ చదవండి: చివరి కోరిక తీరకుండానే చనిపోయిన ఎన్టీఆర్ అభిమాని)

నటి-రాజకీయ నాయకురాలిగా దక్షిణాది ప్రజలకు పరిచయమున్న నటి రమ్య.. తెలుగులోనూ ఓ సినిమాలో నటించింది. కానీ అది ఫ్లాప్ కావడంతో పూర్తిగా కన్నడకే పరిమితమైంది. తాజాగా బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మాట్లాడుతూ రష్మికకు అండగా నిలిచింది.

'రష్మిక లాంటి నటీమణుల్ని ట్రోల్స్ ద్వారా అవమానించడం దయచేసి ఆపండి. ఇది అమానవీయం. ఆడపిల్లలు మెత్తగా ఉంటారు. ఏమన్నా సే తిరిగి మాట్లాడరు కాబట్టి ఇలా హింసించడం తగదు. ఇప్పుడు సినిమా అనే కాదు అన్ని రంగాల్లోనూ మహిళలకు అన్యాయం జరుగుతోంది. దీనికి వ్యతిరేకంగా మనమందరం ఐక్యం కావాలి' అని నటి రమ్య చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: 'రేఖాచిత్రం' సినిమా రివ్యూ (ఓటీటీ))

కెరీర్ ప్రారంభంలో రష్మిక పలు కన్నడ సినిమాలు చేసింది. ఎప్పుడైతే ఫేమ్ వచ్చిందో అప్పటినుంతి తెలుగు, హిందీ, తమిళ మూవీస్ మాత్రమే చేస్తోంది. మొన్నీమధ్య తనది హైదరాబాద్ అని చెప్పడం కన్నడ ప్రేక్షకులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో అదేపనిగా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రమ్య, రష్మికకు అండగా నిలిచింది.

రమ్య తెలుగులో కళ్యాణ్ రామ్ అభిమన్యు చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆమె తెలుగులో నటించిన ఒకే ఒక చిత్రం అదే. ఆ మూవీ పరాజయం చెందడంతో మళ్ళీ తెలుగులో రమ్య కనిపించలేదు.  రష్మిక విషయానికొస్తే కొన్నిరోజుల క్రితం 'పుష్ప 2', తాజాగా 'ఛావా'తో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టింది.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు))

Videos

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)