Breaking News

తెలుగు సినిమా స్థాయి మారిపోయింది: ఉపేంద్ర

Published on Mon, 12/16/2024 - 08:31

కన్నడ స్టార్‌ హీరో ఉపేంద్ర హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘యూఐ’. ఈ సినిమా డిసెంబర్‌ 20న తెలుగులో కూడా విడుదల కానుంది. దీంతో తాజాగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను మేకర్స్‌ జరిపారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాత ఎస్కేఎన్‌ అతిథులుగా పాల్గొన్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను చూసేందుకు తెలుగు ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  అయితే, ఈ వేదికపై టాలీవుడ్‌ పరిశ్రమను ఉపేంద్ర మెచ్చుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతుంది.

1995లో మెగాస్టార్‌ చిరంజీవితో సినిమా చేయాలని నేను ఏడాదిపాటు స్క్రిప్టుతో తిరిగాను. ఇక్కడి నటులు సినిమాలోని కథ, డైలాగ్స్‌ చాలా లోతుగా ఆలోచించి ఓకే చేస్తారని ఆ సమయంలో నాకు అర్థం అయింది. అందుకే ఆయన మేగాస్టార్‌ అయ్యారు. ఆ సమయం నుంచి నేను రెడీ చేసే స్క్రిప్టు విషయంలో చాలా మార్పులు చేసుకున్నాను. ప్రస్తుతం టాలీవుడ్‌ సినిమాలు దేశం దాటి ప్రపంచాన్ని షేక్‌ చేస్తున్నాయి. రూ. 1000 కోట్లు, రూ. 2000 కోట్లు సులువుగా కలెక్షన్స్‌ సాధించే దిశగా తెలుగు పరిశ్రమ వెళ్తుంది. 

టాలెంట్‌ ఉంటే చాలు భాషతో సంబంధం లేకుండా తెలుగు వాళ్లు అభిమానిస్తారు. మీరు ఆదరించే వారిలో నేను కూడా ఒకరిని. 'ఉప్పెన' సినిమా చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. మొదటి సినిమానే ఇలా టేకింగ్‌ చేశారు అంటే నమ్మలేకపోయాను. అందుకే దర్శకుడు బుచ్చిబాబుకు రామ్‌ చరణ్‌ అవకాశం ఇచ్చారు.' అని అన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)