'బెస్ట్‌ ఫేక్‌ న్యూస్‌' అవార్డ్‌ ఇవ్వండి.. సైమాకు సుదీప్‌ కౌంటర్‌

Published on Sat, 10/11/2025 - 07:41

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ విలన్‌గా నటించబోతున్నారంటూ  SIIMA (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) తన ఎక్స్‌ ఖాతాలో ఒక పోస్ట్‌ చేసింది. దీంతో సుదీప్‌( Sudeep) కూడా తనదైన స్టైల్లో సైమాపై పంచ్‌లు వేశారు. తమిళ హీరో శింబు, వెట్రిమారన్‌  మూవీలో విలన్‌ పాత్ర కోసం సుదీప్‌, ఉపేంద్ర ముందు వరుసలో ఉన్నారంటూ సైమా ఒక పోస్ట్‌ చేసింది. ఈ క్రమంలోనే సుదీప్‌ రియాక్ట్‌ అయ్యారు.

సైమా గురించి సుదీప్‌ ఇలా అన్నారు. మీరు సైమా అవార్డ్స్‌ పేరుతో సాయంత్ర సమయంలో చేసే వేడుకపై నాకు అపారమైన గౌరవం ఉంది. కానీ, మీ ఈ వార్తల విషయానికొస్తే.. ఒక సూచన ఇవ్వాలనిపించింది. ఇక నుంచి  మీ మూలాలను మార్చుకొని గాసిప్స్‌ వార్తలు ప్రచారం చేసుకోండి. వచ్చే ఏడాది నుంచి బెస్ట్‌ ఫేక్‌ న్యూస్‌ అవార్డ్‌ పేరుతో సైమాలో చోటు కల్పించండి. అందులోనైనా మీ వార్తకు అవార్డ్‌ వస్తుందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నాను. అని సుదీప్‌ కౌంటర్‌ ఇచ్చారు. అందుకు సైమా కూడా సరదాగా స్పందించింది. మీరు ఇచ్చిన సలహా తప్పకుండా పాటిస్తాం అంటూ మరో ట్వీట్‌ చేసింది. తమకు వచ్చే సమాచారాన్ని ఇంకాస్త మెరుగుపరుచుకుంటామని చెప్పింది. అయితే మొదట చేసిన పోస్ట్‌ను సైమా వెంటనే తొలగించింది.

కన్నడ బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా ఉన్న సుదీప్‌.. తను నటించిన కొత్త చిత్రం 'మార్క్' కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.  2025 క్రిస్మస​్‌ కానుకగా ఈ మూవీ విడుదల కానుంది. ఈ చిత్రానికి విజయ్ కార్తీకేయ దర్శకత్వం వహించారు. గతేడాది విడుదలై 'మాక్స్' చిత్రానికి కూడా ఆయనే దర్శకత్వం వహించారు. అయితే, శివరాజ్‌కుమార్, ఉపేంద్ర, రాజ్ బి. శెట్టి నటించిన 45తో  మార్క్ చిత్రానికి గట్టి పోటీ తప్పదని తెలుస్తోంది. ఆపై అదే సమయంలో  దర్శన్ నటించిన ది డెవిల్ కూడా విడుదల కానుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)