Breaking News

దునియా విజయ్‌ కేసులో నేడు తుది తీర్పు.. ఫ్యాన్స్‌లో ఉత్కంఠ

Published on Thu, 06/13/2024 - 11:52

మొదటిభార్య నాగరత్న నుంచి విడాకులు తీసుకోవాలని కన్నడ హీరో దునియా విజయ్‌ 2018లోనే కోర్టులో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, నేడు తుది తీర్పును కోర్టు వెళ్లడించనుంది. దీంతో ఆయన ఫ్యాన్స్‌లో ఉత్కంఠ నెలకొంది. వీర సింహా రెడ్డి చిత్రంలో విలన్‌గా నటించిన ఆయన తెలుగు వారికి కూడా బాగా దగ్గరయ్యాడు.

నాగరత్న,దునియా విజయ్, అతని రెండవ భార్య కీర్తి మధ్య అప్పట్లో తరచూ గొడవలు జరిగేవి. దీంతో ఎప్పుడూ వారు వార్తల్లో నిలిచేవారు. కుటుంబ గొడవలు వీధినపడటంతో మంచిది కాదని భావించిన విజయ్‌ నాగరత్నతో  తెగతెంపులు చేసుకోవాలని భావించి  బెంగళూరు ఫ్యామిలీ కోర్టులో విడాకుల అర్జీ పెట్టుకున్నాడు. ఆపై 2019లో దునియా విజయ్ మహిళా కమిషన్ ముందు హాజరయ్యాడు. నాగరత్నతో కలిసి జీవించలేనని పేర్కొన్నాడు. ఆ సమయం నుంచి విజయ్‌ తన రెండో భార్య కీర్తితోనే ఉన్నాడు. దాదాపు 6 ఏళ్లుగా కోర్టులో వీరి విడాకుల కేసు  విచారణ జరుగుతుండగా.. ఈ సాయింత్రం తుది తీర్పు వెలువడనుంది.

నాగరత్నతో దూరంగా ఉన్న విజయ్‌ పిల్లల బాధ్యత మాత్రం తనే తీసుకుంటానని ఆప్పట్లోనే తెలిపాడు. నాగరత్నకు భరణం కూడా చెల్లించినట్లు ఆయన గతంలో చెప్పాడు. అయితే,  కోర్టుకు వచ్చిన ప్రతిసారీ తనకు భర్త కావాలని నాగరత్న చెప్పేదని కన్నడ మీడియాలో వార్తలు వచ్చాయి. విజయ్‌ తన పిల్లలను ఇతర దేశాల్లోనే చదవించాడు. కొద్దిరోజుల క్రితం విజయ్‌ పెద్ద కూతురు రితన్య మొదటి సినిమాని ప్రకటించింది. రెండో కూతురు మోనిక విదేశాల్లో  చదువుకుంటుంది. కుమారుడు సామ్రాట్ కూటా తన చదువు పూర్తి అయిన తర్వాత సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)