Breaking News

లైట్‌ బాయ్‌ నుంచి మొదలైన దర్శన్‌ జీవితంలో ఎన్నో వివాదాలు

Published on Sat, 06/15/2024 - 09:33

లైట్‌ బాయ్‌గా సినీ జీవితం ప్రారంభించి అచెలంచెలుగా ఎదిగి ఛాలెంజింగ్‌ స్టార్‌గా నిలబడి కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న కన్నడ హీరో దర్శన్‌ నేపథ్యం చాలా ఆసక్తికరంగా ఉంది. ఎన్నిసార్లు జైలు ముఖం చూసినా ఆయనలో మార్పు రాలేదు. 2011 సెప్టెంబర్‌ 9న దర్శన్‌పై భార్య విజయలక్ష్మి వేధింపులు, దాడి,హత్యాయత్నం కేసు పెట్టింది. ఈ కేసులో దర్శన్‌ జైలుకు వెళ్లాడు. తరువాత భార్య రాజీ కావడంతో కేసు వెనక్కు తీసుకోగా జైలు నుంచి బయటకు వచ్చాడు. దర్శన్‌ జైలుకు వెళ్లి వచ్చాక ఆయన సినిమాలు అఖండ విజయాలు సాధించాయి. వాటిలో సారథి సినిమా మొదటిది. 

2018లో సెప్టెంబర్‌ 24న మైసూరులో దర్శన్‌ ఎస్‌యూవీ కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో కారులో నటుడు దేవరాజ్‌, స్నేహితులు ఉన్నారు. 2021లో  మైసూరులోని ఒక హోటల్‌లో వెయిటర్‌పై శారీరకంగా దాడికి దర్శన్‌ పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. పోలీసుల విచారణ తర్వాత CCTV విజువల్స్ తొలగించబడ్డాయని కూడా వార్తలు వచ్చాయి. తర్వాత వెయిటర్‌కు రూ. 50,000 నష్టపరిహారం అందించారు. భరత్ అనే కన్నడ చిత్ర నిర్మాతను 2022లో దర్శన్ బెదిరించాడు. ప్రాణభయంతో పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశాడు. 2023 జనవరి 20న దర్శన్‌పై వన్యప్రాణుల సంరక్షణా చట్టం కింద కేసు నమోదైంది.

2023 అక్టోబర్‌ 28న పెంపుడు కుక్కను తనపై వదిలి దాడి చేయించాడని దర్శన్‌ ఇంటికి దగ్గర్లో ఉన్న మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  పార్కింగ్ స్థలం విషయంలో తన కేర్‌టేకర్‌తో ఆ మహిళ వాగ్వాదానికి దిగినందున దర్శన్‌ ఈ పని చేశాడని తెలిసింది. అయితే, ఆ మహిళకు ఆసుపత్రి చికిత్స ఛార్జీలతో పరిహారం చెల్లించాడు.

2024 జనవరి 4వ తేదీన బెంగళూరు సుబ్రమణ్యపుర పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఒక హోటల్‌లో లేట్‌నైట్‌ పార్టీ చేసారని దర్శన్‌ అండ్‌ గ్యాంగ్‌పై పోలీసులు వార్నింగ్‌ ఇచ్చారు. ఇలా ఆయన నిజ జీవితంలో ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. ఆయన గతంలో జైలుకు వెళ్లి వచ్చారు. అయినా దర్శన్‌లో ఎలాంటి మార్పులు రాలేదని నెటిజన్లు అంటున్నారు. 

తప్పులు మీద తప్పులు చేస్తూ చివరకు ప్రియురాలి కోసం ఒక హత్యకు కారణం అయ్యాడని వారు తెలుపుతున్నారు. పేద కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి.. లైట్‌ బాయ్‌గా తన ప్రయాణం కొనసాగించిన దర్శన్‌ ఆపై కన్నడలో స్టార్‌ హీరోగా ఎదిగాడు. అలాంటి వ్యక్తి ఇంతటి సాహసానికి పాల్పడ్డాడంటే అభిమానులు కూడా నమ్మలేకపోతున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)