Breaking News

హై సెక్యూరిటీ మధ్య మరో జైలుకు దర్శన్‌ తరలింపు

Published on Thu, 08/29/2024 - 14:57

కన్నడ నటుడు దర్శన్‌ను బెంగుళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి  బళ్లారి సెంట్రల్ జైలుకు నేడు (ఆగష్టు 29) తరలించారు. బెంగుళూరు జైలు అధికారులు దర్శన్‌కు ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్లు అందుకు సంబంధించిన పలు ఫోటోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. ఈ అంశంపై ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది.

కన్నడ చిత్రపరిశ్రమలో సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దర్శన్‌ను గురువారం ఉదయం బళ్లారి సెంట్రల్ జైలుకు తరలించారు. బెంగళూరు పోలీసుల ఎస్కార్ట్‌తో సహా కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో ఆయనను తీసుకెళ్లారు. బల్లారిల సెంట్రల్‌ జైలులో కూడా  ప్రత్యేకంగా నియమించబడిన హై-సెక్యూరిటీ సెల్‌లో దర్శన్‌ను ఉంచారు. బెంగళూరు పరప్పన అగ్రహార నుంచి తెల్లవారుజామున 4.30 గంటలకు పోలీసు వాహనం బయలుదేరి ఉదయం 9.45 గంటలకు బళ్లారి సెంట్రల్ జైలుకు చేరుకుంది. నల్లటి టీషర్ట్ ధరించి కనిపించిన దర్శన్‌.. కుడి చేతికి బ్యాండేజీతో ఉన్నాడు. ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ఎంట్రీ బుక్‌పై సంతకం చేసిన తర్వాత జైలు వైద్యులు ఆరోగ్య పరీక్షలను నిర్వహించి, ఆపై హై-సెక్యూరిటీ సెల్‌కు పంపారు.

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా మీదుగా వెళ్లిన దర్శన్ వాహనానికి స్థానిక పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఎస్పీ శోభారాణి, జైలు సూపరింటెండెంట్ లత ఆధ్వర్యంలో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఎన్నో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ, దర్శన్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు  చేరుకున్నారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా ఆయన అభిమానులను జైలు దగ్గరకు వెళ్లకుండా అన్నీ మార్గాలను బారికేడ్‌లతో మూసేశారు.

దర్శన్‌పై మరో రెండు కేసులు 
దర్శన్‌కు రాచమర్యాదులు అందిన ఘటనలో పరప్పన అగ్రహార పోలీస్‌స్టేషన్‌లో మూడు కేసులు నమోదు కాగా రెండింటిలో దర్శన్‌ మొదటి నిందితుడిగా ఉన్నాడు.  ఈ కేసుల దర్యాప్తునకు సౌత్‌ ఈస్ట్‌ జోన్‌ డీసీపీ సారా ఫాతిమా మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. బేగూరు పోలీస్‌స్టేషన్‌ సీఐ క్రిష్ణకుమార్‌ దర్యాప్తు ప్రారంభించనున్నారు. జైలు లాన్‌లో కూర్చుని దర్శన్‌ రౌడీషిటర్‌ ఇతర ఖైదీలకు ఆ ఏర్పాటు ఎవరు చేశారు?, సిగరెట్లు జైల్లోకి ఎలా వచ్చాయి అనే కోణంలో దర్యాప్తు చేస్తారు. ఈ దృశ్యాలు  ఫొటో, వీడియో ఎలా తీశారనే విషయంపై హుళిమావు సీఐ దర్యాప్తు చేస్తారు. జైలు అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అధికార దురి్వనియోగం తదితర అంశాలపై మూడవ కేసును ఎల్రక్టానిక్‌ సిటీ పోలీస్‌స్టేషన్‌ ఏసీపీ మంజునాథ్‌ దర్యాప్తు చేస్తారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)