Breaking News

హత్య కేసులో స్టార్ హీరోకి మధ్యంతర బెయిల్

Published on Wed, 10/30/2024 - 11:17

కన్నడ హీరో దర్శన్‌కి ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. కాకపోతే ఇది మధ్యంతర బెయిల్. అనారోగ్య సమస్యలు ఉన్నందున ఆరు వారాలు మాత్రమే బెయిల్ గ్రాంట్ చేస్తూ కర్ణాటక హైకోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. అంతకు ముందు దిగువ కోర్టులో దర్శన్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోగా.. కోర్ట్ తిరస్కరించింది. తాజాగా దర్శన్ తరఫు న్యాయవాది హైకోర్టులో అభ్యర్థించడంతో బెయిల్ మంజూరైంది.

దర్శన్‌కి తీవ్రమైన వెన్నునొప్పి ఉందని, దీనికి శస్త్ర చికిత్స అవసరమని. చికిత్స ఆలస్యమైన పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్‌ని దర్శన్ తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించారు.

(ఇదీ చదవండి: అనుమానాస్పద రీతిలో 'కంగువ' ఎడిటర్ మృతి)

డాక్టర్ రిపోర్టులో దర్శన్‌కు చేయాల్సిన సర్జరీ, కోలుకోవడానికి పట్టే సమయం సరిగ్గా లేదని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసన్నకుమార్  వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ విశ్వేశ్వర్ భట్.. 'విచారణలో ఉన్న ఖైదీకి వైద్యం చేయించుకునే హక్కు ఉందని' అని పేర్కొంటూ షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు.

తన ప్రియురాలిని వేధిస్తున్నాడనే నెపంతో రేణుకాస్వామి అనే తన అభిమానిని.. దర్శన్, తన మనుషులతో కలిసి హత్య చేయించాడు. దీనికి పక్కా ఆధారాలు ఉండటంతో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పుడు దర్శన్‌కి మాత్రమే బెయిల్ లభించింది. తమ అభిమాన హీరోకి వచ్చింది మధ్యంతర బెయిల్ అయినప్పటికీ ఇతడి అభిమానులు మాత్రం తెగ ఆనందపడిపోతున్నారు. ఆ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

(ఇదీ చదవండి: ఆ సినిమాలో నా మీద ట్రోలింగ్ చేశారు: కిరణ్ అబ్బవరం)

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు