Breaking News

డబ్బుల కోసం కోర్టుకు వెళ్లిన నటుడు దర్శన్

Published on Tue, 01/21/2025 - 11:53

చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి(Renukaswamy) హత్య కేసులో నటుడు దర్శన్‌కు(Darshan)  బెయిలు రావడంతో ప్రస్తుతం ఆయన తన కెరీర్‌పైన దృష్టి పెట్టారు. పలు సినిమాల్లో నటించిందుకు చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో తన డబ్బు కోసం ఆయన కోర్టును ఆశ్రయించారు. రేణుకాస్వామి హత్య తర్వాత చాలా సమస్యల్లో ఆయన చిక్కుకున్నారు. ఈ కేసు విషయంలో తనకు సంబంధించిన రూ. 37 లక్షల డబ్బును పోలీసులు సీజ్‌ చేసిన విషయం తెలిసిందే.

( ఇదీ చదవండి: గతేడాదిలో పెళ్లి.. గుడ్‌ న్యూస్‌ చెప్పిన కిరణ్ అబ్బవరం)

గత ఏడాది జూన్‌లో జరిగిన రేణుకాస్వామి హత్య కేసు నుంచి దర్శన్‌ బయటపడేందుకు పవన్‌, నిఖిల్‌ అనే వ్యక్తులను సంప్రదించి ఈ కేసును వారిపై వేసుకోవాలని కోరినట్లు విచారణలో తేలింది. అందుకోసం మొత్తం నలుగురికి కలిపి రూ. 37 లక్షలు దర్శన్‌ ఇచ్చినట్లు పోలీసులు అనుమానించారు. పవన్‌ తన ఇంట్లో దాచి ఉంచిన ఆ డబ్బును బెంగళూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు దర్శన్ తన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరుతూ కోర్టులో దరఖాస్తు చేసుకున్నాడు.

హత్య కేసులో నిందితుడు కావడంతో దర్శన్ తుపాకీ లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంది. అందుకే గన్ లైసెన్స్ రద్దు చేయవద్దని దర్శన్ పోలీసు శాఖకు లేఖ రాశారు. తుపాకీ లైసెన్స్‌కు సంబంధించి పోలీసు శాఖ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. అందుకే దర్శన్ విజ్ఞప్తి లేఖ రాశాడు. ఈ విషయం గురించి దర్శన్ మాట్లాడుతూ.. 'నేను సెలబ్రిటీని కావడంతో ఎక్కడికి వెళ్లినా చాలా మంది గుమిగూడుతుంటారు. ఈ క్రమంలో నాకు రక్షణ అవసరం. వ్యక్తిగత కారణాలతో నాకు గన్ లైసెన్స్ కావాలి. లైసెన్స్ రద్దు చేయవద్దు. నాపై నమోదైన కేసులో సాక్షులను ఇప్పటి వరకు ఎక్కడా నేను బెదిరించలేదు. అలా జరిగితే నాపై చట్టపరమైన చర్యలు తీసుకోండి.' అంటూ  లేఖలో ఆయన పేర్కొన్నారు.

బెయిలు రద్దు చేయాలని కోర్టును కోరిన పోలీసులు
రేణుకాస్వామి హత్య కేసులో  దర్శన్‌కు ఇచ్చిన బెయిలు రద్దు చేయాలని కోరుతూ   న్యాయస్థానంలో పోలీసులు అర్జీ దాఖలు చేశారు. వెన్నునొప్పికి శస్త్రచికిత్స అత్యవసరమని ఆరు వారాలు బెయిలు తీసుకుని బయటకు వచ్చిన ఆయన ఇప్పుడు బాగానే ఉన్నారని కోర్టుకు తెలిపారు. కొద్దిరోజులుగా మైసూరు ఫాంహౌస్‌లో విశ్రాంతి తీసుకున్న దర్శన్‌.. మళ్లీ సినిమాల్లో నటించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

త్వరలో ‘డెవిల్’ అనే సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. దర్శన్‌తో పాటు పవిత్రా గౌడ, అనుకుమార్, లక్ష్మణ్, ప్రదోశ్, జగదీశ్‌లకు ఇచ్చిన బెయిలు కూడా రద్దు చేయాలని న్యాయవాది అనిల్‌ సి.నిశానితో పోలీసులు అర్జీ వేయించారు. మరో వారంలోపు ఈ అర్జీ విచారణకు వస్తుందని పోలీసులు తెలిపారు.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)