Breaking News

సూర్య 'కంగువ'.. తెలుగులోనే ముందు!

Published on Sun, 11/03/2024 - 07:43

రీసెంట్ టైంలో తెలుగులో పెద్ద సినిమాలు కొన్నింటికి వేకువజామున షోలు పడుతున్నాయి. 'గుంటూరు కారం', 'సలార్', 'దేవర' చిత్రాలు సూర్యుడు రాకముందే ప్రేక్షకుల్ని పలకరించేశాయి. ఇవంటే తెలుగు సినిమాలు కాబట్టి ప్లాన్ చేశారనుకోవచ్చు. ఇప్పుడు డబ్బింగ్ చిత్రం 'కంగువ' కూడా అదే ఫాలో అయిపోతోంది.

తమిళ హీరో సూర్య చేసిన పాన్ ఇండియా మూవీ 'కంగువ'. నిర్మాత అయితే ఏకంగా రూ.2000 కోట్లు వచ్చేస్తాయనే ధీమాతో ఉన్నారు. బహుశా కంటెంట్‌పై నమ్మకంతో ఇలా అనుండొచ్చు. అయితే ఇప్పుడు అదే నమ్మకంతో ఆంధ్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటకలో వేకువజామున 4 గంటల నుంచే షోలు పడనున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాణ సంస్థే ట్వీట్ చేసింది.

(ఇదీ చదవండి: పెళ్లికి రెడీ అయిన 'పుష్ప' విలన్ జాలిరెడ్డి)

కాకపోతే తమిళనాడు ప్రభుత్వం నుంచి మాత్రం ఇంకా అనుమతి రావాల్సి ఉంది. గతంలో తమిళనాడులోనూ ఎర్లీ మార్నింగ్ షోలు వేసేవారు. కానీ అత్యుత్సాహంతో కొన్ని ప్రమాదాలు జరిగాయి. ఒకరిద్దరు అభిమానులు చనిపోయారు. అప్పటినుంచి తమిళనాడులో వేకువజామున షోలు వేయట్లేదు. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే 'కంగువ' కూడా ఇవ్వకపోవచ్చు. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం తమిళ ప్రేక్షకుల కంటే తెలుగు ఆడియెన్సే 'కంగువ'ని మొదట చూసేస్తారు!

నవంబర్ 14న 'కంగువ' థియేటర్లలోకి రానుంది. అయితే కోర్టులో రిలయన్స్ సంస్థ కేసు పెట్టింది. ఈ చిత్ర నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ తమ దగ్గర తీసుకున్న అప్పు చెల్లించలేదని, అది తిరిగిచ్చేవరకు 'కంగువ' విడుదల నిలుపుదల చేయాలని పిటిషన్ వేసింది. ప్రస్తుతం ఇది విచారణ సాగుతోంది. ఈ సమస్య పరిష్కారమైతే ఓకే. లేదంటే మాత్రం వాయిదా తప్పదేమో?

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ 8: నయని పావని ఎలిమినేట్‌.. ఆ కారణం వల్లే!)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)