Breaking News

పాన్‌ ఇండియా సినిమాలు.. 'కంగువా, తంగలాన్‌' విడుదలకు ఇబ్బందులు

Published on Thu, 02/15/2024 - 11:09

తంగలాన్, గంగువా చిత్రాలను స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. కోలీవుడ్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలు పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కానున్నాయి. భారీ బడ్జెట్‌తో నిర్మించబడుతున్న ఈ రెండు సినిమాల్లో 'తంగలాన్‌' షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని రిపబ్లిక్‌ డే సందర్భంగా జనవరి 26న విడుదల చేయాలనుకున్నారు. కానీ వాయిదా వేసి ఏప్రిల్‌లో విడుదల చేస్తామని దర్శక, నిర్మాతలు ప్రకటించారు. వాయిదాకు సంబంధించిన కారణాలు మాత్రం ఆ సమయంలో తెలుపలేదు.

సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కంగువా’. శివ దర్శకుడు. పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలపై నిర్మాతల్లో ఒకరైన ధనంజయన్ గతంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'సినిమా పూర్తి కాకముందే రిలీజ్‌ డేట్‌ ప్రకటించి ఒత్తిడికి గురి కావడం మాకు ఇష్టం లేదు. ఇది ఇంటర్నేషనల్‌ ప్రాజెక్ట్‌. 3డీ, సీజీ వర్క్‌కు చాలా సమయం పట్టొచ్చు. అందుకే మేమింకా రిలీజ్‌ డేట్‌ నిర్ణయించలేదు. సూర్య పార్ట్‌ షూట్‌ పూర్తైంది. బాబీ దేవోల్‌పై కొంత చిత్రీకరణ ఉంది. 10 భాషల్లో  రిలీజ్‌ చేస్తాం. ప్రస్తుతం మా దృష్టి పోస్ట్‌ ప్రొడెక్షన్‌పై ఉంది.' అని కొద్దిరోజుల క్రితం ఆయన చెప్పారు.

కంగువా చిత్రం పోస్ట్‌ ప్రొడెక్షన్‌ పనులు వల్ల ఆలస్యమైతే.. తంగలాన్‌ మాత్రం గ్రాఫిక్స్‌ వర్క్‌ వల్ల ఆలస్యమవుతుందని మేకర్స్‌ ప్రకటించారు. కానీ  ఫైనాన్స్ సమస్యల కారణంగా ఈ రెండు సినిమాల విడుదలకు ఇబ్బంది ఏర్పడిందని కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. అసలు విషయం చెప్పకుండా గ్రాఫిక్స్‌ వర్క్‌ ఉందని వారు చెబుతున్నారని ప్రచారం జరుగుతుంది.

పా.రంజిత్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న 'తంగలాన్‌' చిత్రాన్ని ఆస్కార్‌కి తీసుకెళ్తామని నిర్మాతలు చెప్పడంతో ఈ మూవీపై భారీ అంచనాలు పెరిగాయి. ఇలాంటి సినిమాలకు గ్రాఫిక్స్‌ వర్క్‌ నిజంగానే ఎక్కువగా ఉంటుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. వాస్తవంగా 'తంగలాన్‌' చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ విడుదలపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.. అదే విధంగా 'కంగువా' కూడా షూటింగ్‌ ప్రారంభమై రెండేళ్లు కావస్తుంది. ఈ చిత్రం విడుదలపై కూడా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన లేదు. దీంతో ఈ రెండు ప్రాజెక్ట్‌లకు ఫైనాన్స్‌ ఇబ్బందులు వచ్చినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)