Breaking News

రిటైర్‌ అయిపోతే మంచిది

Published on Mon, 07/31/2023 - 06:00

‘కరణ్‌ జోహార్‌.. ఫస్ట్‌ నువ్వు రిటైర్‌ అయిపో.. ప్రతిభ ఉన్న కొత్త వాళ్లకు అవకాశాలు కల్పించు.. వారు అద్భుతాలు సృష్టిస్తారు’ అంటూ బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ అన్నారు. రణవీర్‌ సింగ్, ఆలియాభట్‌ జంటగా కరణ్‌ జోహార్‌ దర్శకత్వం వహించిన ‘రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ’ ఈ నెల 28న విడుదలైంది. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా కరణ్‌ జోహార్‌పై మండిపడ్డారు కంగనా రనౌత్‌. ‘‘భారతీయ ప్రేక్షకులు మూడు గంటల సినిమాలో ఎన్నో వింతలు చూస్తున్నారు. కొందరు అద్భుతాలు సృష్టిస్తుంటే ఈ నెపోటిజం గ్యాంగ్‌ మాత్రం రూ.250 కోట్ల బడ్జెట్‌తో డైలీ సీరియల్స్‌ తీస్తున్నారు.

1990లలో తాను తీసిన చిత్రాలనే కాపీ కొట్టి రూ.250 కోట్ల బడ్జెట్‌తో సినిమా చేసినందుకు కరణ్‌ సిగ్గుపడాలి.. డబ్బులు ఎందుకు వృథా చేస్తున్నావ్‌? ప్రతిభ ఉన్న ఎంతో మంది యువత సరైన వనరులు లేక సినిమాలు తీయలేకపోతున్నారు. అలాంటి వాళ్లకి అవకాశం కల్పిస్తే కొత్త కథలతో మూవీస్‌ తీసి విప్లవాత్మక మార్పు తీసుకొస్తారు’’ అన్నారామె. అలాగే  రణ్‌వీర్‌ సింగ్‌ని ఉద్దేశించి–‘‘డ్రెస్సింగ్‌ విషయంలో కరణ్‌ను ఫాలో కావొద్దు. ధర్మేంద్ర, వినోద్‌ ఖన్నా వంటి పెద్దలను స్ఫూర్తిగా తీసుకో. దక్షిణాది నటులను చూసి తెలుసుకో.. వాళ్ల లుక్‌లో ఓ డిగ్నిటీ, ఇంటిగ్రిటీ ఉంటాయి’’ అన్నారు కంగనా.

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)