Breaking News

తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు.. అందుకే చేయలేకపోయా: కంగనా

Published on Sun, 03/19/2023 - 20:36

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పరిచయం అక్కర్లేని పేరు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూ అభిమానులను అలరిస్తుంటారు. ఇటీవలే తనపై కొందరు నిఘా ఉంచారని సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే తాజాగా కంగనాకు సంబంధించిన ఓ వార్త వైరలవుతోంది. గతేడాది తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదురైనట్లు ఆమె తన ఇన్‌స్టాలో తెలిపింది.

గతేడాది ఓ రెస్టారెంట్‌ ప్రారంభించాలకున్నట్లు కంగనా తెలిపింది. కానీ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో అది వీలు కాలేదని పేర్కొంది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ కోమల్ నహతాతో పాల్గొన్న ఇంటర్వ్యూను పంచుకుంది. ఈ వీడియోను మీతో షేర్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.. ఎందుకంటే ఈ విషయాన్ని నేను ఇప్పటికే మర్చిపోయానని కంగనా తెలిపింది.  

గతంలో ఎమర్జెన్సీ చిత్రం నిర్మించడానికి తన ఆస్తులన్నీ తనఖా పెట్టినట్లు కంగనా వెల్లడించారు. ఒకవేళ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైతే తన ఆస్తిని కోల్పోవాల్సి వస్తుందని అన్నారు. నేను కేవలం రూ.500తో ముంబైకి వచ్చానని.. కాబట్టి పూర్తిగా ఫెయిలైనా మరోసారి నిలబడగలననే విశ్వాసముందని తెలిపారు. కాగా.. కంగనా ఇటీవలే ఎమర్జెన్సీ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, విశాక్ నాయర్ నటించారు. ప్రస్తుతం ఆమె తెలుగులో చంద్రముఖి -2 సినిమాలో నటిస్తోంది. 

Videos

మహిళల సింధూరాన్ని చెరిపినవారిని మట్టిలో కలిపేశాం : మోదీ

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)