Breaking News

కంగనా రనౌత్‌ 'ఎమర్జెన్సీ' సినిమాపై కీలక అప్టేడ్

Published on Tue, 10/17/2023 - 09:49

చంద్రముఖి-2 సినిమాతో తెలుగు ప్రేక్షకులను  బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ పలకరించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో థియేటర్స్‌లలో మెప్పించలేకపోయింది. తాజాగా ఆమె నుంచి వస్తునన మరో చిత్రం  'ఎమర్జెన్సీ' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం భారతదేశపు మొదటి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.  పీరియాడిక్‌ డ్రామాగా రానున్న ఈ సినిమాలో కంగనా రనౌత్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

ఈ మూవీ నవంబర్‌ 24న విడుదల కానున్నట్లు మేకర్స్‌ చాలా రోజుల క్రితం ప్రకటించారు. కానీ ఆ సమయంలో విడుదల చేయడంలేదని తాజాగా కంగనా ప్రకటించింది. వచ్చే సంవత్సరంలో 'ఎమర్జెన్సీ' చిత్రాన్ని విడుదల చేస్తామని ఆమె అధికారికంగా ప్రకటించారు. ఇదే విషయాన్ని ఆమె తన ఎక్స్‌ ద్వారా ఇలా తెలిపారు.

'ఎమర్జెన్సీ అనేది నాకు సినిమా మాత్రమే కాదు, ఒక వ్యక్తిగా నా విలువ, నా పాత్రకు పరీక్ష. టీజర్ వల్ల వచ్చిన అద్భుతమైన స్పందన మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించింది. నేను ఎక్కడికి వెళ్లినా ప్రజలు నన్ను ఎమర్జెన్సీ విడుదల తేదీ గురించి అడుగుతున్నారు. కొన్ని కారణాల వల్ల ముందుగా అనుకున్న సమయానికి ఈ సినిమాను విడుదల చేయలేకపోతున్నాము. 2024లో సినిమా విడుదల ఉంటుంది. త్వరలో తేదీ కూడా ప్రకటిస్తాం.' అని కంగనా తెలిపారు.  ఎమర్జెన్సీ చిత్రానికి కంగనానే దర్శకత్వం వహిస్తున్నారు.

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)