Breaking News

'ఎమర్జెన్సీ'ని ప్రకటించిన కంగనా రనౌత్‌

Published on Tue, 06/25/2024 - 10:40

బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్ నటించిన చిత్రం 'ఎమర్జెన్సీ'. కంగనా రనౌత్ రచన, దర్శకత్వం, నిర్మించిన ఈ చిత్రం విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఈ సినిమా విడుదల విషయంలో ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. అయితే, దేశంలో ఎమర్జెన్సీ విధించి  నేటితో 49 ఏళ్లు పూర్తి కానున్నాయి.  50వ ఏడాదిలోకి అడుగుపెడుతుంది. 1975 జూన్‌ 25వ తేదీ అర్ధరాత్రి ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ భారత్‌లో ఎమర్జెన్సీ విధించారు. 'ఎమర్జెన్సీ చీకటిరోజులు' అంటూ తాజాగా తను నిర్మిస్తున్న ఎమర్జెన్సీ సినిమా విడుదల తేదీని కంగనా రనౌత్‌ ప్రకటించారు.

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ బయోపిక్‌గా తెరకెక్కిన 'ఎమర్జెన్సీ' చిత్రం 2024 సెప్టెంబర్‌ 6న విడుదల కానుందని కంగనా రనౌత్‌ తెలిపారు. అందుకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను ఆమె పంచుకున్నారు. వాస్తవంగా  జూన్ 14న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే కంగనా రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో ఈ సినిమా విడుదల విషయంలో జాప్యం ఏర్పడింది. బీజేపీ నుంచి బరిలోకి దిగిన ఆమె హిమాచల్‌లోని 'మండి' నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే.

మణికర్ణిక ప్రొడక్షన్‌పై ఎమర్జెన్సీ చిత్రాన్ని కంగనా రనౌత్‌ నిర్మించారు. ఓ సందర్భంలో కంగనా ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. తనకు సంబంధించిన ఆస్తులన్నింటినీ దీని కోసం తనఖా పెట్టినట్లు ఆమె చెప్పారు. భారీ బడ్జెట్‌లో ఈ చిత్రాన్ని కంగనా నిర్మించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా ఈ సినిమాని ఆమె తెరకెక్కించారు. కంగనా ఇందిరాగాంధీ పాత్రలో నటించగా.. జయప్రకాష్‌ నారాయణ్‌ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే కనిపించనున్నారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)