Breaking News

కంగనా 'ఎమర్జెన్సీ'కి లైన్‌ క్లియర్‌! అందుకు ఓకే అంటేనే..

Published on Thu, 09/26/2024 - 19:18

కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో నటించి, స్వీయ దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ సినిమా విడుదలకు త్వరలోనే లైన్‌ క్లియర్‌ కానుంది. సెన్సార్‌ సర్టిఫికెట్‌ విషయంలో ఓ నిర్ణయానికి రావాలని బాంబే హైకోర్టు.. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌(సీబీఎఫ్‌సీ)ను ఇటీవలే ఆదేశించింది. సెప్టెంబర్‌ 25లోగా ఓ నిర్ణయానికి రావాలని సూచించింది. తాజాగా ఈ అంశంపై బుధవారంనాడు హైకోర్టులో విచారణ జరిగింది.

సెప్టెంబర్‌ 30కి విచారణ వాయిదా
మీ దగ్గర ఏదైనా గుడ్‌న్యూస్‌ ఉందా? అని జస్టిస్ బిపి కొలబావాలా, జస్టిస్ ఫిర్దోష్‌ పోనివాలాలతో కూడిన ధర్మాసనం సీబీఎఫ్‌సీని అడిగింది. సినిమాలో కొన్ని కట్స్‌ సూచించామని, అవి అమలు చేస్తే సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇస్తామని, సినిమా థియేటర్లలో విడుదల చేసుకోవచ్చని సీబీఎఫ్‌సీ తెలిపింది. దీంతో నిర్మాణసంస్థ జీ స్టూడియోస్‌.. తమకు ఆలోచించుకోవడానికి కొంత సమయం కావాలని కోరింది. బెంచ్‌ తదుపరి విచారణను సెప్టెంబర్‌ 30కు వాయిదా వేసింది. సోమవారం అయినా ఎమర్జెన్సీ సినిమాకు చిక్కులు తొలగిపోతాయేమో చూడాలి!

ఎమర్జెన్సీ
ఎమర్జెన్సీ మూవీ విషయానికి వస్తే.. 1975లో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీ 2023 నవంబర్‌ 24న విడుదల కావాల్సింది. కానీ సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఆలస్యం కావడంతో ఏడాదిగా వాయిదా పడుతూ వస్తోంది.

చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)