Breaking News

కంగనా రనౌత్‌ 'ఎమర్జెన్సీ' మరొసారి వాయిదా.. కారణం ఇదే

Published on Thu, 05/16/2024 - 08:40

బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్ నటించిన చిత్రం 'ఎమర్జెన్సీ'. కంగనా రనౌత్ రచన, దర్శకత్వం, నిర్మించిన ఈ చిత్రం 2024లో విడుదల కానుంది. ఈ సినిమాపై చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా సినిమా విడుదల విషయంలో ఆమెకు చెందిన నిర్మాణ సంస్థ నుంచి కీలక ప్రకటన వచ్చింది. మరోసారి వాయిదా వేస్తున్నట్లు వారు ప్రకటించారు. తదుపరి అధికారిక తేదీని త్వరలో ప్రకటిస్తామని కంగనా టీమ్‌ తెలిపింది.

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ బయోపిక్‌గా తెరకెక్కిన 'ఎమర్జెన్సీ' చిత్రం ముందుగా జూన్ 14న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే కంగనా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. బీజేపీ నుంచి బరిలోకి దిగిన ఆమె హిమాచల్‌లోని 'మండి' నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. రెండు రోజుల క్రితమే సుమారు పది లక్షల మంది అభిమానుల సమక్షంలో ఆమె నామినేషన్‌ కూడా వేశారు. ఎన్నికల్లో ఆమె బిజీగా ఉన్న కారణంగానే సినిమా విడుదల తేదీని వాయిదా వేశారు.

ఎమర్జెన్సీ సినిమాను వాయిదా వేస్తూ తనకు సంబంధించిన మణికర్ణిక ప్రొడక్షన్‌ నుంచి సోషల్‌మీడియాలో ఒక పోస్ట్‌ షేర్‌ చేశారు. 'క్వీన్ కంగనా రనౌత్ పట్ల ప్రజలు ఎంతో ప్రేమ చూపుతున్నారు. దీంతో మా హృదయాలు నిండిపోయాయి. ప్రస్తుతం ఆమె దేశసేవకే ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే ఎమర్జెన్సీ సినిమా పనులకు కంగనా దూరంగా ఉన్నారు. దీంతో విడుదల తేదీని వాయిదా వేస్తున్నాం. కొత్త విడుదల తేదీని త్వరలో తెలియచేస్తాం. మీ నిరంతర మద్దతుకు ధన్యవాదాలు.' అంటూ ఆమెకు  చెందిన ప్రొడక్షన్‌ నుంచి ప్రకటన విడుదలైంది. త్వరలో ఎమర్జెన్సీ విడుదల కొత్త తేదీని తెలుపుతామని వారు తెలిపారు.

ఓ సందర్భంలో కంగనా ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. తనకు సంబంధించిన ఆస్తులన్నింటినీ దీని కోసం తనఖా పెట్టినట్లు చెప్పారు. భారీ బడ్జెట్‌లో ఈ చిత్రాన్ని కంగనా నిర్మిస్తున్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా ఈ సినిమాని ఆమె తెరకెక్కించారు. కంగనా ఇందిరాగాంధీ పాత్రలో నటించగా.. జయప్రకాష్‌ నారాయణ్‌ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే కనిపించనున్నారు.

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)