Breaking News

బేబీ రనౌత్‌ రాక కోసం వెయిటింగ్‌: కంగనా రనౌత్‌

Published on Mon, 07/24/2023 - 12:34

బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌, హీరోయిన్‌ కంగనా రనౌత్‌ ఇంట ఆనందాలు వెల్లివిరిశాయి. ఆమె ఇంట్లో త్వరలో బుల్లి రనౌత్‌ రాబోతోంది. అవును, నిజమే.. కంగనా సోదరుడు అక్షత్‌ రనౌత్‌- రీతూ రనౌత్‌ దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ క్రమంలో రీతూ సీమంతం వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ ఫంక్షన్‌కు సంబంధించిన ఫోటోలను కంగనా సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇందులో ఈ బ్యూటీ క్వీన్‌ పింక్‌ కలర్‌ చీరలో, బంగారు ఆభరణాలతో ధగధగ మెరిసిపోయింది. చేతులకు మెహందీ కూడా వేసుకుంది. అక్టోబర్‌లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న వదినకు బంగారు ఆభరణాలను బహుమతిగా ఇచ్చింది.

'రీతూ రనౌత్‌ సీమంతం సెలబ్రేషన్స్‌లోని కొన్ని అద్భుతమైన క్షణాలను పంచుకుంటున్నాను. మా మనసులు సంతోషంతో నిండిపోయాయి. బేబీ రనౌత్‌ రాక కోసం మేమంతా ఎదురుచూస్తున్నాం. శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది కంగనా. ఈ ఫోటోలో కంగనా తల్లి ఆశా, సోదరి రంగోలి, అన్నావదిన ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కంగనా సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె ఎమర్జెన్సీ చిత్రంలో నటిస్తోంది. ఇందులో అనుపమ్‌ ఖేర్‌, మహిమ చౌదరి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 1975లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ ప్రకటించిన సమయంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మణికర్ణిక ఫిలింస్‌ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రం నవంబర్‌ 24న విడుదల కానుంది.

చదవండి: కొత్త కారు కొన్న ముక్కు అవినాశ్‌, మొన్ననే తల్లికి గుండెపోటు, అప్పుడే కారు కొన్నావా?
ఓపెన్‌ హైమర్‌ చిత్రంలో ఆ సీన్‌ తొలగించండి

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)