Breaking News

మోనాలిసా సరే.. వీళ్ల గ్లామర్‌ ఎందుకు నచ్చదు..?: కంగనా రనౌత్‌

Published on Thu, 01/30/2025 - 12:46

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో వైరల్‌ అయిన 'మోనాలిసా'(16) గురించి బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ (Kangana Ranaut) తన అభిప్రాయాన్ని సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. అతిసాధారణ యువతి తన సహజ సౌందర్యంతో అందరినీ కట్టిపడేయంతో ఆమె ఫోటోలు, వీడియోలు నెట్టింట భారీగా వైరల్‌ అయ్యాయి. చాలామంది ఆమెతో ఫోటోలు దిగాలిని, దగ్గరగా చూడాలని  ఎగబడ్డారు కూడా.. అయితే తాజాగా మోనాలిసా గురించి కంగనా చేసిన పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది.

'కుంభమేళాలో మోనాలిసాతో చాలామంది  ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. వారి తీరును చూస్తుంటే చాలా బాధేస్తుంది. అక్కడి వారు ప్రవర్తించిన పద్ధతి ఎంతమాత్రం బాగాలేదు. అలాంటి వారిని ద్వేషించడం తప్ప ఏం చేయలేము. మన చిత్ర పరిశ్రమలో కూడా చాలామంది హీరోయిన్లు ఆమె రంగులోనే ఉన్నారు. వారందరిపై కూడా ఇలాంటి అభిమానమే చూపుతున్నారా..? బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్లుగా కొనసాగిన దీపికా పడుకోణె, కాజోల్‌ వంటి వారిపై చూపుతున్న అభిమానాన్నే కొత్తగా వచ్చే హీరోయిన్లపై చూపుతున్నారా..? 

మోనాలిసాను భారీగా వైరల్‌ చేస్తున్నట్లే ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్త హీరోయిన్లపై కూడా మీ ప్రేమాభిమానాలు చూపించగలరా..? కొత్త వారిని కూడా కాస్త గుర్తించండి.' అని ఆమె పోస్ట్‌ చేశారు.  కంగనా రనౌత్‌ నటించిన ఎమర్జెన్సీ చిత్రం తాజాగా థియేటర్స్‌లోకి వచ్చింది. ఈ మూవీనే కంగనానే దర్శకత్వం వహించింది. మాధవన్‌తో కలిసి ఆమె మరో రెండు చిత్రాలలో నటిస్తుంది.

సొంతూరు వెళ్లిపోయిన మోనాలిసా
మధ్యప్రదేశ్ ఇండోర్‌ సమీపంలో ఉన్న మహేశ్వర్ ప్రాంతానికి చెందిన మోనాలిసా భోంస్లే కుటుంబం ఈనెల 13న మహాకుంభమేళా ప్రారంభానికి ముందే  ప్రయాగరాజ్‌ చేరుకుంది. అక్కడ రుద్రాక్ష దండల అమ్ముతూ కనిపించిన ఆ యువతిని అంతర్జాతీయ న్యూస్‌ ఛానల్‌ ప్రతినిధి ఇంటర్వ్యూ చేసి దానిని వివిధ సోషల్‌ మీడియా వేదికల్లో పోస్టుచేశారు. అంతే.. ఆ వీడియోకు విపరీతమైన క్రేజ్‌ రావడంతో ఆ తర్వాత దేశంలోని ఇతర మీడియా సంస్థలు ఆమెకు విస్తృత ప్రచారం కల్పించి ఆకాశానికెత్తేశాయి.  

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)