Breaking News

చిరు, పవన్ సినిమాల వల్ల అన్యాయం.. ప్రముఖ నటుడు ఆవేదన

Published on Thu, 04/25/2024 - 16:41

'కేరాఫ్ కంచరపాలెం' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు.. చిరంజీవి, పవన్ కల్యాణ్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వీటి వల్ల తనకు అన్యాయం జరిగిందని పరోక్షంగా ఆవేదన వ్యక్తం చేశాడు. షూటింగ్ జరిగిన తర్వాత కూడా తన సీన్స్ ఎందుకు తీసేశారో అర్థం కాలేదని అన్నాడు. ఈ విషయంలో చాలా బాధపడ్డానని కూడా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారిపోయాయి.

(ఇదీ చదవండి: వీడియో: గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్)

వైజాగ్‌కి చెందిన కిశోర్ కుమార్.. 'కేరాఫ్ కంచరపాలెం'తో నటుడిగా మారాడు. ఈ సినిమాలో వినాయకుడి బొమ్మలు చేసే మూగవాడిగా నటించింది ఇతడే. ఈ చిత్రం తర్వాత పలు చిత్రాల్లో సహాయ పాత్రలు చేశాడు. రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు'లో కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. అయితే చిరు 'ఆచార్య', పవన్ 'భీమ్లా నాయక్' చిత్రాల విషయంలో తనకు అన్యాయం జరిగిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 

'ఆచార్య సినిమా కోసం 20 రోజులు షూటింగ్‌లో పాల్గొన్నాను. బాగా చేశానని చిరంజీవి కూడా మెచ్చుకున్నారు. భుజంపై చేయివేసి మరీ మాట్లాడేవారు. తీరా మూవీ విడుదలయ్యాక నా సీన్స్ కనిపించలేదు. ఎడిటింగ్‌లో తీసేశారు. 'భీమ్లా నాయక్' కోసం ఓ రోజు షూటింగ్‌కి వెళ్లాను. మధ్య గ్యాప్ వచ్చింది. తర్వాత నా బదులు వేరే నటుడిని ఆ పాత్ర కోసం తీసుకున్నారు. ఎందుకలా చేశారో అర్థం కాలేదు. ఈ విషయాల్లో చాలా బాధపడ్డాను' అని నటుడు కిశోర్ కుమార్ చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: పవన్‌ విద్యార్హతపై పూటకో మాట.. పిఠాపురం నామినేషన్‌లో తేటతెల్లం)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)