Breaking News

కమల్ హాసన్ థగ్ లైఫ్‌.. ఇండియన్‌-2 కంటే తక్కువ వసూళ్లు!

Published on Mon, 06/09/2025 - 18:10

కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్‌ నటించిన తాజా చిత్రం థగ్‌ లైఫ్‌ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. మణిరత్నం- కమల్ హాసన్ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఈనెల 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాలతో రిలీజైన ఈ మూవీ తొలి రోజే మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. మొదటి రోజు కలెక్షన్ల పరంగా ఫర్వాలేదనిపించినా ఆ తర్వాత పెద్దగా ఆశించినస్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. మూడు రోజుల్లో కేవలం రూ.30 కోట్ల లోపే నెట్ వసూళ్లు సాధించింది.

ఇక వీకెండ్‌ చివరి రోజు ఆదివారం కలెక్షన్లతో కలిసి నాలుగు రోజుల్లో దేశవ్యాప్తంగా ఓవరాల్‌గా రూ.43 నికర వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే  థగ్ లైఫ్ నాలుగు రోజుల్లో రూ.73 కోట్ల నెట్‌ వసూళ్ల మార్క్ చేరుకుంది. ఈ సంఖ్య అంతకుముందు కమల్‌ హాసన్ నటించిన ఇండియన్‌-2 కంటే చాలా తక్కువగా నమోదైంది. గతేడాది విడులదైన ఇండియన్‌-2 నాలుగు రోజుల్లో రూ.113.55 కోట్ల నికర వసూళ్లు సాధించింది.

అయితే థగ్ లైఫ్‌ వసూళ్లు తగ్గడానికి కన్నడ భాష వివాదం కూడా ఓ కారణం. బెంగళూరు ఆడియో లాంఛ్‌ ఈవెంట్‌లో కమల్‌ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయన సినిమాను నిషేధించారు. కమల్ కామెంట్స్‌తో ఈ చిత్రం షెడ్యూల్ కర్ణాటకలో విడుదల కాలేదు. దీనివల్ల కూడా కలెక్షన్లపై ప్రభావం పడిందని చెప్పవచ్చు. కాగా.. ఈ చిత్రంలో శింబు, త్రిష కృష్ణన్, ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్, అభిరామి, జోజు జార్జ్, నాసర్, అలీ ఫజల్, రోహిత్ సరాఫ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఎఆర్ రెహమాన్ సంగీతమందించారు.
 

Videos

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

22 మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా...?

ఎవరికీ ఏం జరిగిన నాదే బాధ్యత.. దాడి తర్వాత అత్యవసర సమావేశం

పోలీసులకెందుకంత భయం? ఎన్నికల్లో పోటీ చేయనివ్వరా? విశ్వేశ్వర్ రెడ్డి ఫైర్

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)