Breaking News

ఇక ప్రచారం తర్వాతే..!  

Published on Tue, 03/26/2024 - 00:11

‘విక్రమ్‌’ (2022) మూవీ బ్లాక్‌ బస్టర్‌ తర్వాత కమల్‌హాసన్‌ తదుపరి చిత్రం కోసం ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. నిజానికి శంకర్‌ దర్శకత్వంలో ‘ఇండియన్‌’ (భారతీయుడు)కి సీక్వెల్‌గా కమల్‌ చేసిన ‘ఇండియన్‌ 2’ ఈపాటికే విడుదల కావాల్సింది. అయితే పలు కారణాల వల్ల షూటింగ్‌లో జాప్యం జరిగింది. ఈ ఏడాది ఈ చిత్రం థియేటర్‌కి వచ్చే అవకాశం ఉంది. దాదాపు పాతికేళ్ల క్రితం వచ్చిన ‘ఇండియన్‌’కి సీక్వెల్‌ కావడంతో ‘ఇండియన్‌2’పై భారీ అంచనాలు ఉన్నాయి.

కాగా కమల్‌హాసన్‌ అంగీకరించిన మరో చిత్రంపై కూడా అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. అదే ‘థగ్‌ లైఫ్‌’. కమల్‌హాసన్‌ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ‘నాయగన్‌’ (నాయకుడు) తర్వాత దాదాపు 35 ఏళ్లకు ఈ కాంబినేషన్‌ ‘థగ్‌ లైఫ్‌’తో రిపీట్‌ అవుతోంది. అయితే ఈ చిత్రం షూటింగ్‌కి కాస్త బ్రేక్‌ పడింది. ఈ విషయం గురించి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కమల్‌హాసన్‌ మాట్లాడుతూ – ‘‘ఇండియన్‌ 2, ఇండియన్‌ 3’ చిత్రాల షూటింగ్‌ పూర్తయింది. రెండో భాగం పోస్ట్‌ ప్రోడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఆ తర్వాత మూడో భాగం పనులు కూడా ఆరంభమవుతాయి. 

‘కల్కి 2898ఏడీ’లో గెస్ట్‌ రోల్‌ చేశాను. ఇక ‘థగ్‌ లైఫ్‌’ షూటింగ్‌ని ఎన్నికల ప్రచారం తర్వాత మొదలుపెడతాం’’ అని స్పష్టం చేశారు. కాగా ఇప్పటివరకూ ‘థగ్‌ లైఫ్‌’ షూటింగ్‌ కొంత భాగం జరిగింది. ఈ మార్చిలో సెర్బియాలో షెడ్యూల్‌ ప్లాన్‌ చేశారు దర్శకుడు మణిరత్నం. అయితే లోక్‌సభ ఎన్నికల కారణంగా ఆ షెడ్యూల్‌ను వాయిదా వేశారు. ఎన్నికల ప్రచారం తర్వాతే ఈ షూటింగ్‌లో కమల్‌హాసన్‌ పాల్గొంటారు. ఈ చిత్రంలో కమల్‌ మూడు పాత్రల్లో కనిపిస్తారని టాక్‌. ఇక ‘మక్కల్‌ నీది మయమ్‌’ పేరిట 2018లో కమల్‌హాసన్‌ పొలిటికల్‌ పార్టీ ఆరంభించిన సంగతి తెలిసిందే.

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)