Breaking News

ఎయిర్‌పోర్ట్‌లో ఇండియన్‌ 2 షూటింగ్‌.. ఎంత డబ్బు కట్టారంటే?

Published on Fri, 06/30/2023 - 08:29

నటుడు కమల్‌ హాసన్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో ఎ.ఎం.రత్నం నిర్మించిన చిత్రం ఇండియన్‌. 1996లో విడుదలైన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. కాగా 27 ఏళ్ల తర్వాత దానికి సీక్వెల్‌గా ఇండియన్‌– 2 చిత్రం రూపొందుతోంది. కమల్‌ హాసన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఇందులో కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, ప్రియా భవాని శంకర్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్‌న్స్‌ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది.

ఏఆర్‌.రెహ్మాన్‌ సంగీతాన్ని అందిస్తున్న ఇండియన్‌–2 సినిమా షూటింగ్‌ ఎట్టకేలకు చివరి దశకు చేరుకుంది. ఇటీవల చైన్నెలోని విమానాశ్రయంలో చిత్రీకరణను జరుపుకుంది. ఇందుకుగాను చిత్ర యూనిట్‌ నుంచి రూ.1.04 కోట్ల విమానాశ్రయం నిర్వాహకం డిపాజిట్‌గా కట్టించుకున్నట్లు సమాచారం. ఇకపోతే ఇటీవల ఈ చిత్రం కోసం శంకర్‌ చిత్రీకరించిన ఒక సన్నివేశం కమల్‌ హాసన్‌ను అబ్బురపరిచింది.

దీని గురించి ఆయన ట్విట్టర్‌లో పేర్కొంటూ ‘నీ బ్రహ్మాండ చిత్రీకరణ అద్భుతం. అది ఇక్కడితో ఆగి పోకూడదు. మీరు ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలి’ అని పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా శంకర్‌కు ఆయన ఖరీదైన వాచ్‌ను కానుకగా అందించారు. అదేవిధంగా ఇప్పటివరకు రూపొందిన ఇండియన్‌–2 చిత్రాన్ని చూసిన కమల్‌ హాసన్‌ చాలా సంతృప్తిని వ్యక్తం చేశారట. ఇకపోతే ఈ చిత్రానికి పార్ట్‌–3 గురించి చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇండియన్‌ 3కి కావాల్సినంత కంటెంట్‌ ఉంది కాబట్టి మరో సీక్వెల్‌ వచ్చే అవకాశం లేకపోలేదని ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఉదయనిధి స్టాలిన్‌ కామెంట్‌ చేయడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లైంది.

చదవండి: బ్రహ్మనందం కోసం మహేష్‌ తీసుకున్న నిర్ణయం గురించి తెలిస్తే..

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)