Breaking News

దర్శకుడికి కమల్‌ ఖరీదైన కానుక 

Published on Sun, 02/12/2023 - 08:42

నటుడు కమలహాసన్‌ను సినిమా సైక్లోపీడియా అంటారు. చిత్రంలో 24 క్రాప్ట్స్‌కు చెందిన ఏ అంశాన్ని అయినా తడమాడకుండా చెప్పే నటుడు ఈయన. ఇటీవల విక్రమ్‌ చిత్రంతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన కమలహాసన్‌ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఇండియన్‌–2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ చిత్ర విజయంపై ప్రేక్షకుల్లో ఎలాంటి సందేహాలు ఉండవని చెప్పవచ్చు.

కాగా విక్రమ్‌ చిత్రం తరువాత కమలహాసన్‌ తన రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై వరుసగా చిత్రాలను నిర్మించనున్నారు. ఆయన నటించే చిత్రాలతో పాటు ఇతర హీరోలతోనూ చిత్రాలు నిర్మించనున్నారు. కాగా ఇండియన్‌–2 చిత్రం తరువాత కమలహాసన్‌ దర్శకుడు హెచ్‌ వినోద్‌తో చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

హెచ్‌ వినోద్‌ దర్శకత్వంలో ఇటీవల అజిత్‌ కథానాయకుడిగా తెరకెక్కించిన తుణివు చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. కాగా ఈయన చెప్పిన కథ కమలహాసన్‌కు బాగా నచ్చిందని సమాచారం. త్వరలోనే ఈ చిత్రం సెట్‌పైకి వెళ్లనున్నట్లు కోలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది.

తాజాగా జరుగుతున్న ప్రచారం ఏమిటంటే కమలహాసన్‌ దర్శకుడు వినోద్‌కు చిత్రం ప్రారంభానికి ముందే అడ్వాన్సుగా ఒక ఖరీదైన కారును కానుకగా ఇచ్చారని సమాచారం. సాధారణంగా చిత్రం సక్సెస్‌ అయితే ఆ చిత్ర నిర్మాత దర్శకడికి ఏదో ఒక ఖరీదైన కానుకను ఇవ్వడం జరుగుతుంటుంది. అలాంటిది కమలహాసన్‌ చిత్రం ప్రారంభం కాకుండానే కారును కానుకగా ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)