Breaking News

రూ. 3వేల కోసం థియేటర్‌లో పనిచేశా: స్టార్‌ హీరో మాజీ భార్య

Published on Tue, 05/17/2022 - 11:14

Kamal Haasan Ex Wife Sarika About Her Financial Status: ఒకప్పుడు ఆమె స్టార్‌ హీరో భార్య, ప్రస్తుతం ఓ స్టార్‌ హీరోయిన్‌ తల్లి.. అయినా ఆమెకు మహమ్మారి కాలంలో ఆర్థిక సమస్యలు తప్పలేదు. లాక్‌డౌన్‌ సమయంలో కేవలం 3వేల కోసం ఆమె థియేటర్‌ ఆర్టిస్టులతో​ కలిసి వర్క్‌ చేశానని చెప్పడం అందరిని షాక్‌కు గురిచేస్తోంది. ఆమె మరెవరో కాదు లెజెండరి నటుడు, హీరో కమల్‌ హాసన్‌ మాజీ భార్య, శుృతి హాసన్‌ తల్లి సారిక. సారిక కూడా ఒకప్పుడు హీరోయిన్‌. కానీ కమల్‌ హాసన్‌ను పెళ్లి చేసుకున్న అనంతరం సినిమాలకు గుడ్‌బై చెప్పి చెన్నై వెళ్లిపోయింది.

చదవండి: ‘సర్కారు వారి పాట’ చూసిన సితార పాప రియాక్షన్‌ ఏంటంటే..

ఇక ఆయనతో విడాకుల అనంతరం తిరిగి ముంబైకి వచ్చిన ఆమె మళ్లీ నటిగా బిజీ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఆమెజాన్‌ ప్రైం ‘మోడ్రన్‌ లవ్‌ ముంబై’ అనే ఆంథాలజీలోని ‘మై బ్యూటీఫుల్‌ రింకిల్స్‌’ అనే పార్ట్‌లో నటించింది. ఇందులో ఆమె నటనకు గాను ప్రశంసలు అందుకుంటోంది. ఈ క్రమంలో ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో కరోనా కాలంలో తాను ఎదుర్కొన్న ఆర్థిక సమస్యలపై నొరు విప్పింది సారిక. ‘కమల్‌తో విడాకుల అనంతరం తిరిగి ముంబై వచ్చాయి. మళ్లీ నటిగా చిన్న చిన్న రోల్స్‌ చేయడం ప్రారంభించాను. అలా ఓ రోజు చూస్తే లైఫ్‌ రోటీన్‌గా అనిపించింది.

చదవండి: బిగ్‌బాస్‌ ఓటీటీ: రవిపై ఫైర్‌ అయిన నటరాజ్‌ మాస్టర్‌?

ఉదయం లేవడం వర్క్‌కు వెళ్లడం.. మళ్లీ రాత్రికి పడుకోవడం. కొత్తగా ఏం అనిపించడం లేదు. దీంతో ఒక ఏడాది పాటు నటనకు బ్రేక్‌ తీసుకున్నా. అదే సమయంలో కరోనా, లాక్‌డౌన్‌లు వచ్చాయి.  దీంతో అయిదేళ్లు ఈజీగా గడిచిపోయాయి. ఈ పాండమిక్‌ సమయంలో నా దగ్గర ఉన్న సేవింగ్స్‌ పూర్తిగా అయిపోయాయి. ఏం చేయాలో తెలియదు. దీంతో థియేటర్‌ ఆర్టిస్టులతో కలిసి వర్క్‌ చేశా. కానీ వారు కేవలం 2000 నుంచి 2700 వరకు మాత్రమే చెల్లించేవారు. దీంతో తిరిగి సినిమాల్లో నటించడమే మంచిదని నిర్ణయించుకున్నా’ అంటూ సారిక చెప్పుకొచ్చింది.

చదవండి: మీడియా ముందుకు కరాటే కల్యాణి: నేను ఎక్కడికీ పారిపోలేదు

దీంతో ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాల్లో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. ఓ స్టార్‌ హీరోయిన్‌ తల్లి అయ్యిండి కూడా ఆమెకు ఇలాంటి పరిస్థితి రావడం ఏంటని అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా కమల్‌-సారికలు కొంతకాలం రిలేషన్‌లో ఉన్న అనంతరం 1998లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు శృతి హాసన్‌, అక్షర హాసన్‌లు జన్మించారు. ఈ క్రమంలో 16 ఏళ్ల పాటు కలిసి ఉన్న కమల్‌-సారికలు 2004లో విడాకులు తీసుకున్నారు. 

Videos

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

వంశీని చూస్తేనే భయమేస్తుంది.. మరీ ఇంత కక్ష సాధింపా..

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)