Breaking News

46 ఏళ్ల తర్వాత క్రేజీ మల్టీస్టారర్‌.. బాక్సాఫీస్‌ బద్దలే!

Published on Mon, 09/08/2025 - 11:20

రజనీకాంత్‌, కమల్హాసన్‌.. భారతీయ చిత్రపరిశ్రమలో అగ్ర హీరోలుగా ఉన్న వీరిద్దరు కలిసి ఒక సినిమా చేయాలని చాలా మంది సినీ ప్రియులు కోరుకుంటున్నారు. వీళ్ల కాంబోలో సినిమా రాబోతున్నట్లు గత కొంతకాలంగా వార్తలు కూడా వస్తున్నాయి. కానీ అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. పైగా సినిమాపై అటు రజనీ కానీ, ఇటు కమల్కానీ స్పందించకపోవడంతో.. ఇదంతా పుకారే అనుకున్నారు. కానీ త్వరలోనే సినీ ప్రియుల కల నిజం కాబోతుంది. కమల్‌, రజనీలను ఒకే స్క్రీన్పై చూడబోతున్నారు. తాజాగా విషయాన్ని కమల్హాసన్అధికారికంగా ప్రకటించాడు.

ఇటీవల జరిగిన సైమా అవార్డుల వేడుకల్లో పాల్గొన్న కమల్‌.. రజనీతో సినిమాపై స్పందించాడు. ‘ప్రేక్షకుల సంతోషమే మాకు ముఖ్యం. మేమిద్దరం కలిసి నటించాలని చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాం. కానీ ఇన్నాళ్లు అది కుదరలేదు. త్వరలోనే మేమిద్దరం మీ ముందుకు రాబోతున్నాం. సినిమా మిమ్మల్ని సర్ప్రైజ్చేస్తుందిఅని కమల్అన్నారు.

 దీంతో ఇరువురి ఫ్యాన్స్తో పాటు సగటు సినీ ప్రేక్షకుడు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 1979 లో వ‌చ్చిన అల్లాయుద్దీన్ అద్భుత దీపం తర్వాత వీరిద్దరు కలిసి నటించలేదు. దాదాపు 46 ఏళ్ల తర్వాత మరోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకోబుతున్నారు. సినిమాకు కాస్త హిట్‌ టాక్‌ వచ్చినా బక్సాఫీస్‌ బద్దలవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను మాత్రం కమల్‌ వెళ్లడించలేదు. గతంలో లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో వీరిద్దరి సినిమా ఉంటుందని రూమర్స్‌ వచ్చాయి. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)